Share News

Viral Video: ఏనుగు ఏంటీ.. ఇలా చేసిందేంటీ..! నిద్రలేచిన కుక్కను చూసి.. సడన్‌గా..

ABN , Publish Date - May 22 , 2024 | 07:29 PM

అడవిలో ఎన్ని జంతువులున్నా.. ఎంత క్రూరమైనవి అయినా.. ఏనుగును చూస్తే భయంతో పారిపోవాల్సిందే. చివరకు అడవికి రాజైన సింహాలు కూడా.. ఏనుగు చూస్తే గజగజా వణికిపోతుంటాయి. వాటి జోలికి వెళ్లాలంటే ఒకటికి వందసార్లు ఆలోచిస్తాయి. అయితే...

Viral Video: ఏనుగు ఏంటీ.. ఇలా చేసిందేంటీ..! నిద్రలేచిన కుక్కను చూసి.. సడన్‌గా..

అడవిలో ఎన్ని జంతువులున్నా.. ఎంత క్రూరమైనవి అయినా.. ఏనుగును చూస్తే భయంతో పారిపోవాల్సిందే. చివరకు అడవికి రాజైన సింహాలు కూడా.. ఏనుగు చూస్తే గజగజా వణికిపోతుంటాయి. వాటి జోలికి వెళ్లాలంటే ఒకటికి వందసార్లు ఆలోచిస్తాయి. అయితే కొన్నిసార్లు ఏనుగులు కూడా భయపడే సందర్భాలు ఎదురవుతుంటాయి. మరికొన్నిసార్లు ఏనుగులు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. నిద్రపోతున్న కుక్కకు వెళ్లిన ఏనుగు.. చివరకు ఏం చేసిందో చూస్తే మీరు కూడా అవాక్కవుతారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ కుక్క (dog) చెట్టు నీడలో ప్రశాంతంగా నిద్రపోతుంటుంది. అటు పక్కనే ఓ వ్యక్తి కూర్చుని ఫోన్ చూసుకుంటుంటాడు. ఇంతలో ఓ భారీ ఏనుగు (elephant) అటుగా వస్తుంది. పడుకున్న కుక్కను గమనించకుండా సమీపానికి వచ్చేస్తుంది. అత్యంత సమీపానికి రాగానే.. కుక్క ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి వెనక్కు తిరిగి చూస్తుంది. ఏనుగును చూసి.. ‘‘ఓహ్.. నువ్వా..! ప్రశాంతంగా నిద్రపోతుంటే.. మొత్తం చెడగొట్టావ్’’.. అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంది.

Viral Video: చుట్టూ గుంపులుగా సింహాలు.. మధ్యలో ఒకే ఒక్క గేదె.. చివరకు ఏం జరిగిందో చూస్తే..


నిద్రలేచిన కుక్కను చూసిన ఏనుగు.. ‘‘అయ్యో.. వెరీ సారీ.. నిద్రాభయం చేసినందుకు నన్ను క్షమించు’’.. అన్నట్లుగా భయంతో అక్కడి నుంచి పక్కకు పారిపోతుంది. ఈ తమాషా సంఘటనను అక్కడే ఉన్న వారు తమ కెమెరాలో రికార్డు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ ఏనుగు చాలా ఫన్నీగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘ఈ ఏనుగు ఎంతో సున్నితంగా ఉందే’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: దండ వేస్తుండగా వధువు షాకింగ్ రియాక్షన్.. భయంతో వణికిపోయిన వరుడు.. చివరకు..

Updated Date - May 22 , 2024 | 07:29 PM