Share News

Viral Video: ఇదెక్కడి క్రియేటివిరా బాబోయ్..! వధూవరుల ప్రాణాల మీదకు తెచ్చిన ఎంట్రీ షాట్..

ABN , Publish Date - May 23 , 2024 | 05:58 PM

సినిమాల్లో చూపించే చిత్రవిచిత్ర ప్రయోగాలన్నీ ప్రస్తుతం నిజ జీవితంలోనూ చూస్తున్నాం. కొన్నిసార్లు అయితే.. సినిమా సీన్లకు మించిన సీన్స్‌ను కూడా చూస్తుంటాం. అందులోనూ వివాహ కార్యక్రమాల్లో ఇలాంటి ఘటనలు తరచూ చూస్తుంటాం. ప్రస్తుతం..

Viral Video: ఇదెక్కడి క్రియేటివిరా బాబోయ్..! వధూవరుల ప్రాణాల మీదకు తెచ్చిన ఎంట్రీ షాట్..

సినిమాల్లో చూపించే చిత్రవిచిత్ర ప్రయోగాలన్నీ ప్రస్తుతం నిజ జీవితంలోనూ చూస్తున్నాం. కొన్నిసార్లు అయితే.. సినిమా సీన్లకు మించిన సీన్స్‌ను కూడా చూస్తుంటాం. అందులోనూ వివాహ కార్యక్రమాల్లో ఇలాంటి ఘటనలు తరచూ చూస్తుంటాం. ప్రస్తుతం సోషల్ మీడియాలో అందుబాటులో ఉండడంతో ఇలాంటి వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఓ వివాహానికి సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. కళ్యాణ మంటపంలోకి వధూవరులు ఇచ్చిన ఎంట్రీ చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా ‘‘ఇదెక్కడి క్రియేటివిరా.. నాయనా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో చోటు చేసుకున్న వినూత్న ఘటనను చూసి అతిథులంతా అవాక్కవుతున్నారు. ఇటీవల ప్రతి వివాహ కార్యక్రమంలోనూ వధూవరుల ఎంట్రీ (bride and groom Entry) వినూత్నంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ వివాహ కార్యక్రమంలో వధూవరుల ఎంట్రీ పూర్తి విభిన్నంగా ఉండేలా ప్లాన్ చేశారు. అది ఎంతా అంటే.. వధూవరులు ఇద్దరికీ నిప్పు అంటించారు. మంటలు వ్యాపించగానే.. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని పరుగెడుతూ కళ్యాణ మంటపంలోకి వచ్చేలా నిపుణుల పర్యవేక్షణలో ఏర్పాట్లు చేశారు.

Viral Video: ఇదేంటీ.. చేపలు పట్టడం మరీ ఇంత ఈజీనా.. చూస్తే అవాక్కవ్వాల్సిందే..


అందుకు దగ్గట్టుగానే వధూవరులు కూడా మంటల మధ్యలో మంటపంలోకి దూసుకొచ్చారు. వంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో చుట్టూ ఉన్న వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే వధూవరుల వెనుకే ఓ వ్యక్తి మంటలు ఆర్పేందుకు సిలిండర్ పట్టుకుని సిద్ధంగా ఉంటాడు. మొత్తానికి ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో..! ఇదెక్కడి క్రియేటివిరా నాయనా’’.. అంటూ కొందరు, ‘‘వీళ్ల పిచ్చి పీక్స్‌కు వెళ్లింది’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 60 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు.. పచ్చి మామిడిని క్షణాల్లో పండుగా ఎలా మార్చాడంటే..

Updated Date - May 23 , 2024 | 06:32 PM