Share News

Viral Video: నాలుకను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది.. ఈ ఆవు తెలివి చూస్తే అవాక్కవ్వాల్సిందే..

ABN , Publish Date - May 22 , 2024 | 08:35 PM

కొన్ని జంతువులు మనుషుల మాదిరే తెలివిగా ప్రవర్తిస్తుంటాయి. మరికొన్ని జంతువులు.. మనుషులు కూడా ఆశ్చర్యపడేలా ప్రవర్తిస్తుంటాయి. ఇంకొన్ని జంతువులు మనుషులు కూడా చేయలేని పనులను సులభంగా చేసేస్తుంటాయి. ఇలాంటి ...

Viral Video: నాలుకను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది.. ఈ ఆవు తెలివి చూస్తే అవాక్కవ్వాల్సిందే..

కొన్ని జంతువులు మనుషుల మాదిరే తెలివిగా ప్రవర్తిస్తుంటాయి. మరికొన్ని జంతువులు.. మనుషులు కూడా ఆశ్చర్యపడేలా ప్రవర్తిస్తుంటాయి. ఇంకొన్ని జంతువులు మనుషులు కూడా చేయలేని పనులను సులభంగా చేసేస్తుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఆ ఆవుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ ఆవు తన నాలుకతో చేసిన విచిత్రమైన పని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘నాలుకను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొన్ని ఆవులను ఓ గదిలో ఉంచి గేటుకు తాళం వేసి ఉంటారు. అయితే లోపల ఉన్న ఆవుల్లో ఓ ఆవుకు.. ఎలాగైనా బయటికి వెళ్లాలని అనిపిస్తుంది. అయితే గేటు మూసి ఉండడంతో సాధ్యం కాదు. అయినా ఏదోటి చేసి బయటికి వెళ్లాలని అనుకుంటుంది. చివరకు అటూ ఇటూ చూడగా గేటు గొళ్లెం తీయడానికి ప్రయత్నిస్తుంది. ఇందుకోసం తన నాలుకను ఉపయోగిస్తుంది. గేటు ఇనుప రాడ్ల మధ్యలో తల ఉంచి, తన పొడవాటి తలను బయటికి తీస్తుంది.

Viral Video: ఏనుగు ఏంటీ.. ఇలా చేసిందేంటీ..! నిద్రలేచిన కుక్కను చూసి.. సడన్‌గా..


ఆవు తన నాలుకతో ఎంతో చాకచక్యంగా (cow opened gate with tongue) పక్కనే ఉన్న గొళ్లెంను తెరుస్తుంది. ఆ తర్వాత గేటును తీసేసి, ఎంచక్కా బయటికి వెళ్లిపోతుంది. ఈ ఘటనను ఆవుల యజమాని వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో చూసిన వారంతా ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఈ ఆవు టాలెంట్ అద్భుతంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘నాలుకతో గేటు తీయొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్‌కి పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: దండ వేస్తుండగా వధువు షాకింగ్ రియాక్షన్.. భయంతో వణికిపోయిన వరుడు.. చివరకు..

Updated Date - May 22 , 2024 | 08:35 PM