Share News

Viral Video: వామ్మో..! గుడ్లగూబ ఇలాంటి పనులు చేస్తాయా.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..

ABN , Publish Date - May 22 , 2024 | 09:38 PM

కొన్ని పక్షులను చూస్తే పదే పదే చూడాలి అనిపిస్తుంటుంది. అలాగే మరికొన్ని పక్షులను చూస్తే చేతులతో పట్టుకుని దగ్గరికి తీసుకోవాలని అనిపిస్తుంటుంది. కానీ గుడ్లగూబ లాంటి పక్షిని చూస్తే మాత్రం భయంతో ఒళ్లంతా కంపనం పుడుతుంది. అది కనిపించిందంటేనే..

Viral Video: వామ్మో..! గుడ్లగూబ ఇలాంటి పనులు చేస్తాయా.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..

కొన్ని పక్షులను చూస్తే పదే పదే చూడాలి అనిపిస్తుంటుంది. అలాగే మరికొన్ని పక్షులను చూస్తే చేతులతో పట్టుకుని దగ్గరికి తీసుకోవాలని అనిపిస్తుంటుంది. కానీ గుడ్లగూబ లాంటి పక్షిని చూస్తే మాత్రం భయంతో ఒళ్లంతా కంపనం పుడుతుంది. అది కనిపించిందంటేనే ఆమడదూరం పారిపోతుంటారు. ఇలాంటి భయకంర గుడ్లగూబలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా వైరల్ అవుతున్న గుడ్లగూబ వీడియో.. నెటిజన్లను మరింత భయపెడుతోంది. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘వామ్మో..! గుడ్లగూబ ఇలాంటి పనులు చేస్తాయా’’.. అంటూ షాక్ అవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రాత్రి వేళ్ల ఓ అడవిలో ఓ గుడ్లగూబ (owl) చేసిన పని చూసి అంతా షాక్ అవుతున్నారు. అడవిలో వెళ్తున్న వారు లైటు వేయగానే వారికి ఓ గుడ్లగూబ కనిపించింది. అయితే అది అప్పటికే ఓ పామును వేటాడడమే కాకుండా దాన్ని (owl swallowing snake) నోటితో పట్టుకుని మింగే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు పాము దాని నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తోంది.

Viral Video: నాలుకను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది.. ఈ ఆవు తెలివి చూస్తే అవాక్కవ్వాల్సిందే..


అయినా గుడ్లగూబ మాత్రం పామును వదలకుండా గట్టిగా పట్టుకుని కొంచెం, కొంచెంగా చివరకు పామును మొత్తం మింగేసింది. చూస్తుండగానే అంత పెద్ద పామును అమాంతం మింగేయడం చూసి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వామ్మో..! ఈ గుడ్లగూబను చూస్తుంటే భయమేస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి గుడ్లగూబను ఇప్పుడే చూస్తు్న్నాం’’.. అంటూ మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.60లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఏనుగు ఏంటీ.. ఇలా చేసిందేంటీ..! నిద్రలేచిన కుక్కను చూసి.. సడన్‌గా..

Updated Date - May 22 , 2024 | 09:38 PM