Share News

Viral Video: వామ్మో..! ఇదెక్కడి సరదారా నాయనా.. రాత్రి వేళ ఈ అమ్మాయి చేసిన పనికి..

ABN , Publish Date - May 24 , 2024 | 04:57 PM

కొందరు ఏదోటి చేసి సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఆలోచనలోనే ఉంటారు. ఈ క్రమంలో కొందరు ఎలాంటి పనులు చేయడానికైనా సిద్ధపడతారు. ఇటీవల కొందరు అమ్మాయిలు కూడా ఏవేవో పిచ్చి పిచ్చి పనులు చేయడం చూస్తున్నాం. కొందరు..

Viral Video: వామ్మో..! ఇదెక్కడి సరదారా నాయనా.. రాత్రి వేళ ఈ అమ్మాయి చేసిన పనికి..

కొందరు ఏదోటి చేసి సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఆలోచనలోనే ఉంటారు. ఈ క్రమంలో కొందరు ఎలాంటి పనులు చేయడానికైనా సిద్ధపడతారు. ఇటీవల కొందరు అమ్మాయిలు కూడా ఏవేవో పిచ్చి పిచ్చి పనులు చేయడం చూస్తున్నాం. కొందరు బస్సు, రైళ్లలో ప్రయాణికుల మధ్యలో డాన్సులు వేయడం, అర్ధనగ్న ప్రదర్శనలు ఇవ్వడం చూస్తుంటాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఓ అమ్మాయి రాత్రి వేళ సరదా కోసం చేసిన పని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘వామ్మో..! ఇదెక్కడి సరదారా నాయనా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి ప్రాంక్ వీడియోలు (women prank videos) చేసేందుకు విచిత్రంగా ప్లాన్ చేసింది. తెల్లటి దుస్తులు ధరించి, రోడ్డు పక్కన గోడపై ఇనుప ఊచలు పట్టుకుని వేలాడుతూ ఉంది. మధ్య మధ్యలో ఏడుస్తున్నట్లుగా నటిస్తోంది. ఇంతలో ఓ వ్యక్తి అటుగా వెళ్తూ ఆమెను గమనిస్తాడు. గోడపై ఏడుస్తున్న అమ్మాయిని చూసి షాక్ అవుతాడు. ఏం జరిగిందో తెలుసుకోవాలని దగ్గరగా వెళ్తాడు. ఆమె ఏడుస్తుండడం చూసి భయం భయంగానే దగ్గరికి వెళ్లి ఆమెను ముట్టుకుంటాడు.

Viral Video: ఈత కొట్టేందుకు మొసళ్ల చెరువులోకి దూకిన బాలుడు.. చివరికి ఏం జరిగిందో చూస్తే..


ఆ వ్యక్తి ముట్టుకోగానే ఆమె సడన్‌గా ఆమె మొఖాన్ని అతడి వైపు తిప్పుతుంది. దయ్యం ఆకారంలో ఉన్న ఆమె మొఖాన్ని చూసి అతను బిత్తరపోతాడు. గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి పరుగందుకుంటాడు. రోడ్డుపై పల్టీలు కొడుతూ కంటికి కనిపించనంత దూరం పారిపోతాడు. ఇదంతా చూస్తుంటే.. వాళ్లంతా కలిసి కావాలనే ఇలా ప్లాన్ చేసినట్లు ఉన్నా కూడా వీడియో మాత్రం వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇదెక్కడి ప్రాంక్ వీడియోరా నాయనా’’.. అంటూ కొందరు, ‘‘ఈమె నటన మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు.. పచ్చి మామిడిని క్షణాల్లో పండుగా ఎలా మార్చాడంటే..

Updated Date - May 24 , 2024 | 04:57 PM