Share News

Viral Video: ఇది మామూలు తెలివికాదురోయ్..! స్టాండింగ్ ఫ్యాన్‌తో ఇతడు చేసిన ప్రయోగం చూస్తే.. వారెవ్వా.. అనాల్సిందే..

ABN , Publish Date - May 24 , 2024 | 05:59 PM

కొందరు చిన్న చిన్న ప్రయోగాలతో పెద్ద ప్రయోజనాలు పొందుతుంటారు. ఇంకొందరు వినూత్నంగా ఆలోచిస్తూ వింత వింత టెక్నిక్‌లతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఎండ వేడి నుంచి తప్పించుకునేందుకు చాలా మంది అనేక రకాల ప్రయోగాలు చేయడం చూస్తుంటాం. కొందరు..

Viral Video: ఇది మామూలు తెలివికాదురోయ్..! స్టాండింగ్ ఫ్యాన్‌తో ఇతడు చేసిన ప్రయోగం చూస్తే.. వారెవ్వా.. అనాల్సిందే..

కొందరు చిన్న చిన్న ప్రయోగాలతో పెద్ద ప్రయోజనాలు పొందుతుంటారు. ఇంకొందరు వినూత్నంగా ఆలోచిస్తూ వింత వింత టెక్నిక్‌లతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఎండ వేడి నుంచి తప్పించుకునేందుకు చాలా మంది అనేక రకాల ప్రయోగాలు చేయడం చూస్తుంటాం. కొందరు ఫ్రిడ్జ్‌కి ఫ్యాన్ జాయింట్ చేస్తే.. మరికొందరు తమ ఇంటిపై ఏకంగా స్ప్రికంర్లనే ఏర్పాటు చేస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా, ఓ వ్యక్తి స్టాండింగ్ ఫ్యాన్‌తో చేసిన ప్రయోగం చూసి అంతా అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు విచిత్రంగా ఆలోచించాడు. ఇందుకోసం అతను స్టాండింగ్ ఫ్యాన్‌ (Standing fan) తీసుకుని, దానికి వెనుక రెండు వైపులా ప్లాస్టిక్ డబ్బాలను ఏర్పాటు చేస్తాడు. ఆ డబ్బాల్లో చల్లగాలి వచ్చేందుకు వీలుగా కూలర్‌కు వాడే గడ్డిని నింపుతాడు. అలాగే ఫ్యాన్ కింద నీళ్ల బకెట్ ఏర్పాటు చేసి, దాని నుంచి ప్లాస్టిక్ డబ్బాల్లోకి పైపలను ఏర్పాటు చేస్తాడు.

Viral Video: వామ్మో..! ఇదెక్కడి సరదారా నాయనా.. రాత్రి వేళ ఈ అమ్మాయి చేసిన పనికి..


బకెట్‌లోని నీరు ఓ పైపు నుంచి పైకి వెళ్లి, ప్లాస్టిక్ డబ్బా్ల్లోని గడ్డిలో పడుతూ మళ్లీ కింద ఉన్న బకెట్‌లో పడుతుంటాయి. దీంతో ఫ్యాన్ తిరగడం వల్ల చల్లటి గాలి బయటికి వచ్చేలా ఏర్పాట్లు చేశాడు. ఈ వ్యక్తి చేసిన ప్రయోగం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ ఐడియా ఏదో బాగుందే’’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఈత కొట్టేందుకు మొసళ్ల చెరువులోకి దూకిన బాలుడు.. చివరికి ఏం జరిగిందో చూస్తే..

Updated Date - May 24 , 2024 | 05:59 PM