Share News

Puzzle: మీరు నిజంగా జీనియస్ అయితే.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..

ABN , Publish Date - May 24 , 2024 | 07:36 PM

ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాలు పెద్దలతో పాటూ చిన్న పిల్లలను కూడా తెగ ఆకట్టుకుంటుంటాయి. వాటిలో కొన్నింటికి సమాధానాలు తెలుసుకోవడం కష్టంగా ఉన్నా చాలా మంది వాటిని పరిష్కరించేందుకు ఆసక్తిచూపుతుంటారు. ఇలాంటి పజిల్స్‌కు సమాధానాలు...

Puzzle: మీరు నిజంగా జీనియస్ అయితే.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..

ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాలు పెద్దలతో పాటూ చిన్న పిల్లలను కూడా తెగ ఆకట్టుకుంటుంటాయి. వాటిలో కొన్నింటికి సమాధానాలు తెలుసుకోవడం కష్టంగా ఉన్నా చాలా మంది వాటిని పరిష్కరించేందుకు ఆసక్తిచూపుతుంటారు. ఇలాంటి పజిల్స్‌కు సమాధానాలు కనుక్కోవడానికి ప్రయత్నించడం వల్ల మానసికోళ్లాసం కలుగుతుంది. అలాగే ఏకాగ్రత కూడా పెరుగుతుంది. ఇందుకోసం తాజాగా, మీ ముందుకు ఓ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న రెండు చిత్రాల్లో మొత్తం 3 తేడాలు ఉన్నాయి. అవేంటో కనుక్కునేందుకు ప్రయత్నించండి మరి..


సోషల్ మీడియాలో పజిల్ ఫొటో (Puzzle Viral Photos) తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న రెండు చిత్రాల్లో ఓ ఆదివమానవుడు గుహ బయట కూర్చున్నాడు. అలాగే ఓ చేత్తో రాయితో చేసిన మొల, మరో చేత్తో సుత్తి లాంటి వస్తువును పట్టుకుని పెద్ద చెక్క ముక్కను ఒక ఆకారంలోకి తెస్తున్నాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే మీ కంటికి ఓ పరీక్ష పెడుతున్నాం.

Viral Video: ఇది మామూలు తెలివికాదురోయ్..! స్టాండింగ్ ఫ్యాన్‌తో ఇతడు చేసిన ప్రయోగం చూస్తే.. వారెవ్వా.. అనాల్సిందే..


చూసేందుకు ఈ రెండు చిత్రాలు ఒకేలా కనిపిస్తున్నాయి. చిన్న తేడా కూడా లేనట్లు అనిపిస్తుంది. కానీ బాగా పరిశీలిస్తే ఈ రెండు చిత్రాల్లో మొత్తం 3 తేడాలు (3 differences) ఉన్నాయి. వాటిని గుర్తించేందుకు నెటిజన్లు చాలా శ్రమిస్తున్నారు. కానీ కొందరు మాత్రమే ఆ తేడాలను గుర్తించగలుగుతున్నారు.

Viral Video: ఈత కొట్టేందుకు మొసళ్ల చెరువులోకి దూకిన బాలుడు.. చివరికి ఏం జరిగిందో చూస్తే..


ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓసారి ప్రయత్నించి చూడండి. ఆ తేడాలను వెంటనే గుర్తించగలిగారంటే మాత్రం.. మీరు జీనియస్ అని అర్థం. ఒకవేళ ఇప్పటికీ ఆ తేడాలను పరిగట్టలేకుంటే మాత్రం.. ఈ కింద ఇచ్చిన ఫొటో చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

puzzle-viral-photos.jpg

Viral Video: వామ్మో..! ఇదెక్కడి సరదారా నాయనా.. రాత్రి వేళ ఈ అమ్మాయి చేసిన పనికి..

Updated Date - May 24 , 2024 | 07:36 PM