Share News

Viral Video: ఈ కోతి ఎన్నాళ్ల నుంచి వెంటాడుతుందో ఏమో గానీ.. ఇంట్లో పడుకున్న వ్యక్తి వద్దకు వెళ్లి మరీ..

ABN , Publish Date - May 24 , 2024 | 08:56 PM

కొన్నిసార్లు కొన్ని జంతువులు జన సంచార ప్రదేశాల్లోకి వెళ్లి బీభత్సం సృష్టించడం చూస్తుంటాం. పలులు, సింహాలు, ఏనుగులు ఇలా అనేక జంతువులు గ్రామాల్లోకి చొరబడుతుంటాయి. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు మనుషులపై కూడా దాడి చేస్తుంటాయి. ఇలాంటి..

Viral Video: ఈ కోతి ఎన్నాళ్ల నుంచి వెంటాడుతుందో ఏమో గానీ.. ఇంట్లో పడుకున్న వ్యక్తి వద్దకు వెళ్లి మరీ..

కొన్నిసార్లు కొన్ని జంతువులు జన సంచార ప్రదేశాల్లోకి వెళ్లి బీభత్సం సృష్టించడం చూస్తుంటాం. పలులు, సింహాలు, ఏనుగులు ఇలా అనేక జంతువులు గ్రామాల్లోకి చొరబడుతుంటాయి. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు మనుషులపై కూడా దాడి చేస్తుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే ఇప్పుడు మనం చూడబోయే ఓ కోతి ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తించింది. ఎన్నాళ్ల నుంచి మనసులో పెట్టకుందో ఏమో గానీ.. ఇంట్లో పడుకుని ఉన్న వ్యక్తి వద్దకు వెళ్లిన కోతి.. చివరకు ఏం చేసిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి గదిలో దుప్పటి కప్పుకొని పడుకుని ఉంటాడు. ఆ సమయంలో ఓ కోతి లోపలికి వస్తుంది. సాధారణంగా ఏ కోతి అయినా ఇళ్లల్లోకి వచ్చిన సమయంలో ఏదో పదార్థమో, వస్తువో ఎత్తుకుని వెళ్లిపోతుంది. కానీ ఈ కోతి మాత్రం విచిత్రంగా ఉన్నట్టుంది. లోపలికి వచ్చీ రావడమే .. నేరుగా పడుకున్న వ్యక్తి వద్దకు వెళ్లి ముందు కాళ్లతో తట్టి మరీ నిద్ర లేపుతుంది. నిద్రలేచిన ఆ వ్యక్తి కోతిని చూసి భయంతో కాళ్లతో తన్ని పైకి లేచి నిలబడుకుంటాడు. అయినా కోతి ఏమాత్రం వెనక్కు తగ్గకుండా (monkey attacked man) అతడిపై డాడి చేసేందుకు సిద్ధపడుతుంది.

Viral Video: చూసేందుకు జిరాక్స్ మిషిన్‌లా ఉందేంటని అనుకుంటున్నారా.. ఇందులో బట్టలు వేస్తే.. చివరకు..


అతనిపై ఎంతో కసి ఉన్నట్లుగా మీద మీదకు దూకుతుంది. అతడు కర్రతో కొడుతున్నా వదలకుండా ఎగిరి దాడి చేస్తుంది. దీంతో మరింత భయపడిపోయిన ఆ వ్యక్తి కోతి నుంచి దూరంగా పారిపోయేందుకు ప్రయత్నిస్తాడు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో..! ఈ కోతి మరీ దారుణంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘పగ తీర్చుకోవడానికే వచ్చినట్లుందే’’.. అంటూ మరికొందరు, షాకింగ్ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.70లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఈత కొట్టేందుకు మొసళ్ల చెరువులోకి దూకిన బాలుడు.. చివరికి ఏం జరిగిందో చూస్తే..

Updated Date - May 24 , 2024 | 08:56 PM