Share News

Viral Video: వామ్మో..! ఏంటయ్యా ఇదీ.. ఈ వ్యక్తి రాగానే చుట్టూ చేరిన చేపలు.. చివరకు..

ABN , Publish Date - May 25 , 2024 | 03:07 PM

కొందరు ఎలాంటి వివిధ రకాల జంతువులను మచ్చిక చేసుకుని వాటితో స్నేహం చేయడం చూస్తుంటాం. మరికొందరు క్రూర జంతువులతోనూ చిన్న పిల్లల్లా ఆటలు ఆడుకుంటుంటారు. ఇంకొందరు...

Viral Video: వామ్మో..! ఏంటయ్యా ఇదీ.. ఈ వ్యక్తి రాగానే చుట్టూ చేరిన చేపలు.. చివరకు..

కొందరు ఎలాంటి వివిధ రకాల జంతువులను మచ్చిక చేసుకుని వాటితో స్నేహం చేయడం చూస్తుంటాం. మరికొందరు క్రూర జంతువులతోనూ చిన్న పిల్లల్లా ఆటలు ఆడుకుంటుంటారు. ఇంకొందరు అనేక జంతువులకు ఆహారం పంచిపెడుతూ వాటిని ప్రేమగా చూసుకుంటుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వ్యక్తి చేసిన పని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఆ వ్యక్తి నీటిలోకి దిగగానే పెద్ద పెద్ద చేపలన్నీ చుట్టూ చేరాయి. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి చేపలకు (Fish) సంబంధించిన ఆహారాన్ని ఓ సంచిలో వేసుకుని చెరువులోకి వెళ్తాడు. అతడు అలా వెళ్లగానే పెద్ద పెద్ద చేపలన్నీ వచ్చి అతడి చుట్టూ చేరతాయి. తర్వాత అతను సంచిలోని ఆహారంలో (food) కొద్ది కొద్దిగా తీసుకుని చేప నోట్లో వేస్తుంటాడు. ఇలా ఒక్కొక్క చేప అతడు పంచిన ప్రసాదాన్ని తీసుకుని బుద్ధిగా అక్కడి నుంచి వెళ్లిపోతుంటాయి. ఇలా చేపలు అతడి వద్ద ఎంతో వినయంగా ప్రవర్తిస్తూ ఆహారం తీసుకోవడం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

Viral Video: ఈ కోతి ఎన్నాళ్ల నుంచి వెంటాడుతుందో ఏమో గానీ.. ఇంట్లో పడుకున్న వ్యక్తి వద్దకు వెళ్లి మరీ..


అతను కూడా ఎంతో ఓపిగ్గా ఒక్కో చేపకు ఆహారం అందించి, వాటి తలపై చేత్తో ప్రేమగా నిమురుతుంటాడు. ఇలా అతడి వద్దకు వచ్చిన చేపలన్నింటికీ ఆహారం పంచిపెడుతూ వాటికి స్నేహితుడిలా మారిపోతాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ చేపలు చాలా విచిత్రంగా ఉన్నాయే’’.. అంటూ కొందరు, ‘‘వీరి స్నేహం చూడముచ్చటగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. 7 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వధువు ఎదుటే యువతితో సెల్ఫీ దిగాడు.. చివరకు ఆమె ఇచ్చిన రియాక్షన్‌తో ఖంగుతిన్నాడు..

Updated Date - May 25 , 2024 | 03:08 PM