Share News

Lok Sabha Election 2024:రేవంత్ నా సవాల్‪ను స్వీకరించకుండానే డైలాగ్‪లు కొడుతున్నారు: హరీశ్‌రావు

ABN , Publish Date - May 09 , 2024 | 04:02 PM

తెలంగాణలో 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయలేక అట్టర్ ఫ్లాప్ అయిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) విమర్శించారు. కేవలం ఐదు నెలల కాలంలోనే రేవంత్ ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకత తెచ్చుకుందని అన్నారు. బీజేపీ తెలంగాణకు మొండిచేయి చూపించిందని ఆరోపణలు చేశారు. ఆ పార్టీ కార్మికులకు వ్యతిరేకంగా, కార్పొరేట్లకు అనుకూలంగా పని చేస్తుందని విమర్శించారు.

Lok Sabha Election 2024:రేవంత్ నా సవాల్‪ను స్వీకరించకుండానే డైలాగ్‪లు కొడుతున్నారు: హరీశ్‌రావు
Harish Rao

సిద్దిపేట: తెలంగాణలో 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయలేక అట్టర్ ఫ్లాప్ అయిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) విమర్శించారు. కేవలం ఐదు నెలల కాలంలోనే రేవంత్ ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకత తెచ్చుకుందని అన్నారు. బీజేపీ తెలంగాణకు మొండిచేయి చూపించిందని ఆరోపణలు చేశారు. ఆ పార్టీ కార్మికులకు వ్యతిరేకంగా, కార్పొరేట్లకు అనుకూలంగా పని చేస్తుందని విమర్శించారు.


KCR : చిన్నపాటి వానకే పది గంటలు కరెంట్‌ పోతదా?

గురువారం ఏబీఎన్‌తో హరీశ్‌రావు మాట్లాడుతూ... తెలంగాణలో బీజేపీ మతం పేరిట ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. మత రాజకీయాలు తెలంగాణలో నడవవని మందలించారు. కాంగ్రెస్ చేసింది చెబితే అభ్యంతరం లేదని కానీ చేయనివి కూడా చెబుతూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు, రుణమాఫీ అమలు చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారని ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.


Sabita Reddy: కాంగ్రెస్‌ గ్యారెంటీలకు కాలం చెల్లింది..

ఇప్పుడు దేవుళ్లమీద ఒట్లు పెడుతున్నారని.. ఇప్పుడు కూడా చెబుతున్నా పంద్రాగస్టులోగా ఆరు గ్యారంటీలు, రుణమాఫీ చేస్తే రాజీనామాకు తాను సిద్ధమని హరీశ్‌రావు మరోసారి సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి తన సవాల్‌ను స్వీకరించకుండానే డైలాగ్‌లు కొడుతున్నారని సెటైర్లు విసిరారు. పబ్బం గడుపుకునే రాజకీయాలు చేస్తూ కేసీఆర్ పట్ల రేవంత్ అనుచితంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రెండు జాతీయ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు.


హిందువుల ఆస్తులు ముస్లింలకు ఇవ్వడం జరగదని.. రిజర్వేషన్లు తొలగించడం జరగదని చెప్పుకొచ్చారు. రెండు జాతీయ పార్టీలు ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తున్నాయని ధ్వజమెత్తారు. రేవంత్ ప్రభుత్వం రివర్స్‌లో నడుస్తోందని ఎద్దేవా చేశారు. సిద్దిపేటలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షో ఉంటుందని ప్రకటించారు. ఈ రోడ్ షో ముస్తాబాద్ చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు ఉంటుందని వెల్లడించారు. మెదక్‌ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ద్వితీయ స్థానం బీజేపీనా, కాంగ్రెస్సా అనేది ఆ పార్టీలే తేల్చుకోవాలని హరీశ్‌రావు పేర్కొన్నారు.


T.High Court: అమిత్‌ షా వీడియో మార్ఫింగ్ కేసులో హైకోర్టుకు టీపీసీసీ

Read latest Telangana News And Telugu News

Updated Date - May 09 , 2024 | 04:06 PM