Viral Video: కొంపముంచిన ఇన్‌స్టా రీల్.. ఖరీదైన హోటల్లో బెడ్‌పై నోట్ల కట్టలతో వీడియో చేసిన బాలుడు.. చివరకు..

ABN , First Publish Date - 2023-10-05T20:49:50+05:30 IST

సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే క్రమంలో కొందరు చిత్రవిచిత్రమైన పనులు చేస్తుంటారు. యువతీయువకులతో పాటూ వివిధ రకాల వృత్తుల్లో ఉన్న వారు సైతం రీల్స్ వీడియోలు చేయడం సర్వసాధారమైంది. చివరకు కొందరు వైద్యులు, పోలీసులు తదితరులు కూడా రీల్స్ చేస్తుండడం చూస్తున్నాం. ఇలాంటి ..

Viral Video: కొంపముంచిన ఇన్‌స్టా రీల్.. ఖరీదైన హోటల్లో బెడ్‌పై నోట్ల కట్టలతో వీడియో చేసిన బాలుడు.. చివరకు..

సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే క్రమంలో కొందరు చిత్రవిచిత్రమైన పనులు చేస్తుంటారు. యువతీయువకులతో పాటూ వివిధ రకాల వృత్తుల్లో ఉన్న వారు సైతం రీల్స్ వీడియోలు చేయడం సర్వసాధారమైంది. చివరకు కొందరు వైద్యులు, పోలీసులు తదితరులు కూడా రీల్స్ చేస్తుండడం చూస్తున్నాం. ఇలాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ బాలుడికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఖరీదైన హోటల్లో బెడ్‌పై నోట్ల కట్టలతో ఓ బాలుడు ఇన్‌స్టా రీల్ చేశాడు. అయితే చివరకు పోలీసుల విచారణలో దిమ్మతిరిగే ట్విస్ట్ చోటు చేసుకుంది.

ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) కాన్పూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ బాలుడు ఇటీవల ఓ రోజు కాన్పూర్‌లోని (Kanpur) ఓ ఖరీదైన హోటల్‌కి వెళ్లాడు. ఓ గదిని బుక్ చేసుకుని, చివరకు అందులో ఇన్‌స్టా రీల్ (Insta Reel) చేశాడు. అయితే ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో తన బెడ్‌పై కరెన్సీ నోట్ల కట్టలను చెల్లాచెదురుగా పడేయడంతో పాటూ చేతిలో కూడా నోట్ల కట్ట పట్టుకుని వీడియో చేశాడు. తర్వాత ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఈ వీడియో వైరల్ అవడంతో పోలీసుల వరకూ వెళ్లింది. అయితే ఈ వీడియో చూడగానే పోలీసులకు అనుమానం వచ్చింది. వీడియో అప్‌లోడ్ చేసిన సమయంలోనే అదే ప్రాంతంలో ఓ చోరీ జరిగింది.

Viral Video: కిందపడ్డ యువతులకు సాయం చేద్దామని వెళ్లాడు.. చివరికి అతడి పరిస్థితి ఏమైందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

కాన్పూర్‌లో తరుణ్ శర్మ అనే జ్యోతిష్యుడి ఇంట్లో (Theft of cash) చోరీ జరిగింది. అతడి ఇంట్లోని సీసీ కెమెరాల్లో చోరీ ఘటన మొత్తం రికార్డ్ అయింది. ఈ ఫుటేజీ చూసిన పోలీసులకు.. ఇన్‌స్టా వైరల్ వీడియో గుర్తొచ్చింది. చోరీ చేసిన వ్యక్తి తర్వాత హోటల్‌కి వెళ్లి వీడియో చేసి ఉండొచ్చని భావించారు. చివరకు డిజిటల్ ట్రాకంగ్ సిస్టమ్ ద్వారా దొంగను పట్టుకున్నారు. విచారణలో అతను నేరం అంగీకరించాడు. అతడి వద్ద నుంచి రూ.2లక్షల నగదు, రెండు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: ఎవరో చేసిన తప్పులకు.. ఇంకెవరో బలవడం అంటే ఇదేనేమో.. పాపం తన మానాన తాను నడుచుకుంటూ వెళ్తుండగా..

Updated Date - 2023-10-05T20:49:50+05:30 IST