Viral Video: బాబోయ్.. ఇదెక్కడి వింత..? తలపై ఫ్రిడ్జ్‌ను పెట్టుకుని మోయడమే గొప్ప అనుకుంటే.. ఈ కుర్రాడు ఏం చేస్తున్నాడో చూస్తే..!

ABN , First Publish Date - 2023-10-04T20:57:07+05:30 IST

కూటి కోసం కోటి విద్యలన్నట్లుగా.. కొందరు తమ కుటుంబ పోషణ కోసం రేయింబవళ్లూ నిద్రాహారాలు మాని కష్టపడుతుంటారు. ఇంకొందరు, ప్రమాదమని తెలిసినా తమ శక్తికి మించిన పనులు చేస్తుంటారు. ఈ క్రమంలో మరికొందరు భారీ బరువులను సైతం అవలీలగా..

Viral Video: బాబోయ్.. ఇదెక్కడి వింత..? తలపై ఫ్రిడ్జ్‌ను పెట్టుకుని మోయడమే గొప్ప అనుకుంటే.. ఈ కుర్రాడు ఏం చేస్తున్నాడో చూస్తే..!

కూటి కోసం కోటి విద్యలన్నట్లుగా.. కొందరు తమ కుటుంబ పోషణ కోసం రేయింబవళ్లూ నిద్రాహారాలు మాని కష్టపడుతుంటారు. ఇంకొందరు, ప్రమాదమని తెలిసినా తమ శక్తికి మించిన పనులు చేస్తుంటారు. ఈ క్రమంలో మరికొందరు భారీ బరువులను సైతం అవలీలగా మోస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. బైకును తలపై పెట్టుకుని అవలీలగా బస్సు ఎక్కిన వారిని చూశాం, తలపై గ్యాస్ సిలిండర్ పెట్టుకుని డాన్స్ చేసిన మహిళను కూడా చూశాం, అదేవిధంగా సర్కస్‌లో చిత్రవిచిత్ర సాహసాలు చేస్తూ.. తద్వారా వచ్చే డబ్బులతో కుటుంబాలను పోషించేవారిని కూడా చూశాం. తాజాగా, ఇలాంటి కోవకు చెందిన ఓ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

ఓ వ్యక్తి చేసిన వినూత్న సాహసానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఫ్రిడ్జ్‌ను పైకి ఎత్తడమే గగనం అనుకుంటే ఓ వ్యక్తి దాన్ని పైకి ఎత్తడమే కాకుండా.. ఏకంగా తలపై పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా (man rides bicycle with fridge on his head) తలపై ఫ్రిడ్జ్‌ని బ్యాలెన్స్ చేస్తూ సైకిల్ కూడా తొక్కాడు. అలాగే రద్దీగా ఉన్న రోడ్డు పైకి వచ్చేశాడు. దీంతో ఇతన్ని చూసి చుట్టుపక్కల వారంతా నోరెళ్లబెట్టారు. అంత బరువు తలపై ఉన్నా.. ఎక్కడా బ్యాలెన్స్ తప్పకుండా సైకిల్ నడిపాడు.

Viral Video: నీ ల్యాప్‌టాప్ ఇవ్వవా.. అంటూ పిన్నిని అడిగిందో బాలిక.. నీకెందుకంటూ గదిలోంచి నెట్టేసిందని అదిరిపోయే ప్లాన్..!

మధ్య మధ్యలో కిందపడిపోతాడేమో.. అని అనిపిస్తుంది. కానీ అతను మాత్రం ఫ్రిడ్జ్‌ను ఎంతో చాకచక్యంగా బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్లాడు. రోడ్డు పక్కన ఉన్నవారంతా అతన్ని ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. కొందరు ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో! ఇతడి టాలెంట్.. మామూలుగా లేదుగా’’.. అని కొందరు, ‘‘ఇలాంటి టాలెంట్ కొంత మందికి మాత్రమే ఉంటుంది’’.. అని మరికొందరు, ‘‘రియల్ బాహుబలి’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: తలపై గ్యాస్ సిలిండర్ పెట్టుకుని.. కింద ఓ చిన్న బిందెను బోర్లించి.. ఈ మహిళ చేసిన రిస్క్ చూస్తే నోరెళ్ల బెట్టాల్సిందే..!

Updated Date - 2023-10-04T20:58:17+05:30 IST