Viral Video: నీ ల్యాప్‌టాప్ ఇవ్వవా.. అంటూ పిన్నిని అడిగిందో బాలిక.. నీకెందుకంటూ గదిలోంచి నెట్టేసిందని అదిరిపోయే ప్లాన్..!

ABN , First Publish Date - 2023-10-04T18:26:47+05:30 IST

చిన్న పిల్లలు ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తుంటారు. కొందరు పిల్లలు ఆటలే ప్రపంచంగా గడుపుతుంటే.. మరికొందరు పిల్లలు చిన్న వయసులోనే తమలోని క్రియేటివిటీని బయటపెడుతుంటారు. ఇలాంటి పిల్లలను చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి పిల్లల తెలివేటలకు సంబంధించిన ఫొటోలు..

Viral Video: నీ ల్యాప్‌టాప్ ఇవ్వవా.. అంటూ పిన్నిని అడిగిందో బాలిక.. నీకెందుకంటూ గదిలోంచి నెట్టేసిందని అదిరిపోయే ప్లాన్..!

చిన్న పిల్లలు ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తుంటారు. కొందరు పిల్లలు ఆటలే ప్రపంచంగా గడుపుతుంటే.. మరికొందరు పిల్లలు చిన్న వయసులోనే తమలోని క్రియేటివిటీని బయటపెడుతుంటారు. ఇలాంటి పిల్లలను చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి పిల్లల తెలివేటలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి బాలికకు సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ‘‘ల్యాప్‌టాప్ ఇవ్వవా’’.. అంటూ ఓ బాలిక తన పిన్నిని అడిగింది. నీకెందుకంటూ గదిలోంచి నెట్టేయడంతో చివరకు బాలిక ఏం చేసిందంటే..

సోషల్ మీడియాలో ఓ ఫొటో (Viral photos) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళకు తన మేనకోడలు పెద్ద షాకే ఇచ్చింది. సదరు మహిళ తన ల్యాప్‌టాప్‌లో (Laptop) వర్క్ చేసుకునే సమయంలో తన మేనకోడలు వచ్చింది. ‘‘పిన్నీ.. ఒకసారి నీ ల్యాప్‌టాప్ ఇవ్వవా’’.. అని అడిగింది. దీంతో ఆమె బాలికపై (girl) ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘నీకెందుకూ.. వెళ్లి ఆడుకోపో’’.. అని గదిలోంచి నెట్టేసింది. దీంతో తెగ బాధపడిపోయిన బాలిక.. చివరకు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఎలాగైనా సరే తానే సొంతంగా ల్యాప్‌టాప్ తయారు చేయాలని నిర్ణయించుకుంది. చివరకు తనలోని టాలెంట్‌ని బయటకి తీసింది. ఓ పెద్ద అట్ట ముక్కను ల్యాప్‌టాప్‌ ఆకారంలో కత్తిరించింది.

Viral Video: కొత్తగా కారును కొన్న మోజు.. నదిని దాటేందుకు నేరుగా నీళ్లలోకి పోనిచ్చిన కుర్రాళ్లు.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!

తర్వాత ల్యాప్‌టాప్ మానిటర్ స్థానంలో నల్లటి రంగును పూసింది. అలాగే కీబోర్డు స్థానంలో ముందే రెడీ చేసి పెట్టుకున్న అక్షరాలతో కూడిన పేపర్‌ను అంటించింది. ఇలా ఫైనల్‌గా అచ్చం ల్యాప్‌టాప్ (girl make laptop out of cardboard) తరహాలోనే సిద్ధం చేసింది. తర్వాత కీబోర్డుపై అక్షరాలను నొక్కుతూ ప్రాక్టీస్ చేయడం మొదలెట్టింది. బాలిక తెలివితేటలు చూసి ముచ్చటపడిపోయిన మహిళ.. ఫొటోలు తీసి, సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ బాలిక తెలివితేటలు అద్భుతం’’.. అని కొందరు, ‘‘భవిష్యత్‌లో ఈ పాప ఉన్నత స్థానానికి వెళ్తుంది’’.. అని మరికొందరు, ‘‘వాట్ ఏ క్రియేటివిటీ’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ పోస్టు ప్రస్తుతం 2లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Shocking Video: ఫుల్లు రద్దీగా మెట్రో రైలు.. ఓ మహిళ శరీరం సగం బయటే ఉండగానే మూసుకుపోతున్న డోర్లు.. చివరకు..!

Updated Date - 2023-10-04T18:26:47+05:30 IST