Viral Video: కొత్తగా కారును కొన్న మోజు.. నదిని దాటేందుకు నేరుగా నీళ్లలోకి పోనిచ్చిన కుర్రాళ్లు.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!

ABN , First Publish Date - 2023-10-04T17:05:45+05:30 IST

ప్రమాదమని తెలిసినా కొందరు తెలిసి తెలిసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. చాలా మంది యువత అయితే వాహనం చేతిలో ఉంటే.. ప్రపంచాన్నే మర్చిపోతుంటారు. అధిక వేగంతో కొందరు, అవగాహన లేక మరికొందరు ప్రమాదంలో చిక్కుకుంటుంటారు. ఇలాంటి...

Viral Video: కొత్తగా కారును కొన్న మోజు.. నదిని దాటేందుకు నేరుగా నీళ్లలోకి పోనిచ్చిన కుర్రాళ్లు.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!

ప్రమాదమని తెలిసినా కొందరు తెలిసి తెలిసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. చాలా మంది యువత అయితే వాహనం చేతిలో ఉంటే.. ప్రపంచాన్నే మర్చిపోతుంటారు. అధిక వేగంతో కొందరు, అవగాహన లేక మరికొందరు ప్రమాదంలో చిక్కుకుంటుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కొత్తగా కొన్న కారులో ముగ్గురు యువకులు ఏకంగా నదిని దాటేందుకు ప్రయత్నించారు. చివరకు షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.

ఉత్తరాఖండ్‌ (Uttarakhand) రామ్‍‌నగర్ పరిధి మూర్చాలా అనే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి పర్యాటక ప్రాంతానికి నిత్యం అనేక మంది సందర్శకులు వస్తుంటారు. ముగ్గురు యువకులు మహీంద్రా థార్ SUV వాహనాన్ని తీసుకున్నారు. ఈ సంతోషంలో మూర్చాలా ప్రాంతంలోని హిల్ స్టేషన్ తదితర పర్యాటక ప్రదేశాలను (Tourist places) వీక్షించేందుకు పయనమయ్యారు. అయితే తీరా మూర్చాలా వద్దకు చేరుకోగానే అక్కడి రామ్‍‌గంగా నది ఉదృతంగా ప్రవహిస్తోంది. అయితే నదిపై ఉన్న వంతెన మీదుగా వెళ్లకుండా.. సాహసం చేయాలనే ఉద్దేశంతో ఏకంగా నదిలోని దారి నుంచే దాటాలని ప్రయత్నించారు. ప్రమాదమని తెలిసినా వారు ఈ సాహసానికి పూనుకోవడం చూసి అక్కడున్న వారంతా అలాగే చేస్తుండిపోయారు. నదిలోకి దిగిన కారు మధ్యలోకి వెళ్లగానే (car stuck in river) నీటి ఉదృతికి ఒక్కసారిగా ఆగిపోయింది.

Shocking Video: ఫుల్లు రద్దీగా మెట్రో రైలు.. ఓ మహిళ శరీరం సగం బయటే ఉండగానే మూసుకుపోతున్న డోర్లు.. చివరకు..!

అయితే నదిలో ఓ పెద్ద రాయికి ఇరుక్కుపోవడంతో కొట్టుకుపోకుండా అక్కడే నిలబడిపోయింది. వాహనంలోని ముగ్గురూ భయంతో కేకలు వేయడంతో చుట్టు పక్కల ఉన్న వారు కాపాడే ప్రయత్నం చేశారు. అయితే అది సాధ్యం కాకపోవడంతో వెంటనే రెస్క్యూ టీమ్‌కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీమ్‌ బృందం.. సేఫ్టీ జాకెట్లు, తాడు సాయంతో వారి వద్దకు చేరుకున్నారు. చివరకు వారిని అతి కష్టం మీద సురక్షితంగా బయటికి తీశారు. తర్వాత క్రేన్ సాయంతో కారును బయటకు లాక్కొచ్చారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి సాహసాలు చేయడం ప్రమాదం’’.. అని కొందరు, ‘‘వీరి టైం బాగుంది కాబట్టి సరిపోయింది’’.. అని మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 55వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: తలపై గ్యాస్ సిలిండర్ పెట్టుకుని.. కింద ఓ చిన్న బిందెను బోర్లించి.. ఈ మహిళ చేసిన రిస్క్ చూస్తే నోరెళ్ల బెట్టాల్సిందే..!

Updated Date - 2023-10-04T17:05:45+05:30 IST