Viral Video: నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల వర్షం.. మనీహీస్ట్‌ మాస్కు వేసుకుని.. కారు పైకి ఎక్కి మరీ డబ్బులు వెదజల్లిన వ్యక్తి..!

ABN , First Publish Date - 2023-10-03T21:47:44+05:30 IST

జాతర, వివాహాలు తదితర కార్యక్రమాల్లో డాన్సులు వేసే సమయంలో కరెన్సీ నోట్లను విసిరేయడం తరచూ చూస్తూనే ఉంటాం. ఊరు, పేరు తెలీని కొందరు ఉన్నట్టుండి జనం మధ్యలోకి వచ్చి డబ్బులు వెదజల్లుతూ హల్‌చల్ చేస్తుంటారు. కొందరైతే వాహనాల్లో వెళ్తూ కూడా...

Viral Video: నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల వర్షం.. మనీహీస్ట్‌ మాస్కు వేసుకుని.. కారు పైకి ఎక్కి మరీ డబ్బులు వెదజల్లిన వ్యక్తి..!

జాతర, వివాహాలు తదితర కార్యక్రమాల్లో డాన్సులు వేసే సమయంలో కరెన్సీ నోట్లను విసిరేయడం తరచూ చూస్తూనే ఉంటాం. ఊరు, పేరు తెలీని కొందరు ఉన్నట్టుండి జనం మధ్యలోకి వచ్చి డబ్బులు వెదజల్లుతూ హల్‌చల్ చేస్తుంటారు. కొందరైతే వాహనాల్లో వెళ్తూ కూడా నోట్ల కట్టలను గాల్లోకి విరిసేస్తుంటారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, రాజస్థాన్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ వ్యక్తి నడి రోడ్డుపై కరెన్సీ నోట్ల వర్షం కురిపించాడు. మనీహీస్ట్ మాస్క్ వేసుకుని ఇతడు చేసిన పనికి స్థానికులంతా షాక్ అయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

రాజస్థాన్ (Rajasthan) జైపూర్‌లోని గౌరవ్ టవర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎప్పుడు జరిగిందో ఏమో తెలీదు గానీ.. స్థానిక మాల్వియా నగర్‌లో ఇటీవల ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. మనీహీస్ట్ (Money Heist) అనే వెబ్ సిరీస్‌లో చూపిన విధంగా ఓ యువకుడు ఎర్రటి దుస్తులు ధరించి, మొఖానికి మాస్క్ పెట్టుకుని కారులో స్థానికంగా ఉన్న పెద్ద పెద్ద మాల్స్‌, కాంప్లెక్స్‌ల వద్దకు చేరుకున్నాడు. జన సందోహం మధ్యలోనే కారు ఆపి, కాసేపటికి ఏకంగా కారు పైకి ఎక్కేశాడు. దీంతో, ఇతను ఏం చేస్తున్నాడబ్బా..! అని అక్కడున్న వారంతా ఆసక్తిగా చూస్తున్నారు.

Lovers: ఇద్దరూ చావాలనుకున్నారు కానీ.. విధిరాత వేరేలా ఉందేమో.. గొంతు కోసుకున్నా కూడా ప్రియుడు బతికాడు కానీ..!

కారు పైకి ఎక్కిన వ్యక్తి తర్వాత తన వద్ద ఉన్న బ్యాగులో నుంచి కరెన్సీ నోట్లను (Man throws currency notes) తీసి వెదజల్లడం మొదలెట్టాడు. దీంతో చుట్టూ ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. షాక్ నుంచి వెంటనే తేరుకుని పరుగెత్తుకుంటూ వాటిని ఏరుకునేందుకు వెళ్లారు. దీంతో ఒక్కసారిగా అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. ఇలా సుమారు 15 నుంచి 20 నిముషాల పాటు లక్షల రూపాయల మేర రూ.20, రూ.50 నోట్లను వెదజళ్లాడు. ఈ ఘటనను చాలా మంది తమ ఫోన్లలో బంధించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వీడికి డబ్బులు బాగా ఎక్కువైపోయాయేమో’’.. అని కొందరు, ‘‘అదేదో పేదలకు సాయం చేయొచ్చుగా’’.. అని మరికొందరు, ‘‘వీడికి ఇదేం పిచ్చిరా నాయనా’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఓ మహిళకు.. సడన్‌గా వినిపించిందో శబ్దం.. అరుపులు వినిపించిన వైపు వెళ్లి చూస్తే..!

Updated Date - 2023-10-03T21:47:44+05:30 IST