Viral Video: కిందపడ్డ యువతులకు సాయం చేద్దామని వెళ్లాడు.. చివరికి అతడి పరిస్థితి ఏమైందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

ABN , First Publish Date - 2023-10-05T19:56:58+05:30 IST

కొన్నిసార్లు ఎదుటి వారికి సాయం చేద్దామని వెళ్తే.. చివరికి అసలుకే ఎసరు వస్తుంటుంది. ఇంకొన్నిసార్లు ఏదో చేయాలని వెళ్తే ఇంకేదో అవుతుంటుంది. ఇలాంటి సమయంలో అప్పుడప్పుడూ షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. అయితే ఇలాంటి ఘటనలు కొన్నిసార్లు...

Viral Video: కిందపడ్డ యువతులకు సాయం చేద్దామని వెళ్లాడు.. చివరికి అతడి పరిస్థితి ఏమైందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

కొన్నిసార్లు ఎదుటి వారికి సాయం చేద్దామని వెళ్తే.. చివరికి అసలుకే ఎసరు వస్తుంటుంది. ఇంకొన్నిసార్లు ఏదో చేయాలని వెళ్తే ఇంకేదో అవుతుంటుంది. ఇలాంటి సమయంలో అప్పుడప్పుడూ షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. అయితే ఇలాంటి ఘటనలు కొన్నిసార్లు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. తమాషా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. కిందపడ్డ యువతులకు సాయం చేద్దామని వెళ్లిన వ్యక్తి పరిస్థితి చివరకు ఏమైందో చూసి అంతా పగలబడి నవ్వుకుంటున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు యువతులు (Young women) స్కూటీపై వెళ్తుంటారు. మార్గ మధ్యలో వారికి కారు ఎదురుగా ఓ కారు కనపడుతుంది. దీంతో స్కూటీని మెల్లిగా స్లో చేస్తారు. కానీ తీరా కారు దగ్గరికి రాగానే.. అదుపు తప్పి కిందపడిపోతారు. కింద పడ్డ యువతులు స్కూటీని (Scooty) పైకి ఎత్తలేక ఇబ్బంది పడుతుంటారు. దూరం నుంచి వీరిని గమనించిన ఓ వ్యక్తి కాపాడేందుకు పరుగెత్తుకుంటూ వస్తాడు. వారి వద్దకు వచ్చి స్కూటీని పైకి ఎత్తి స్టాండ్ వేయాలని చూస్తాడు.

Shocking: ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారా..? జర జాగ్రత్త.. 4 ఏళ్ల పిల్లాడు ఎలాంటి పరిస్థితుల్లో చనిపోయాడో తెలిస్తే..!

అయితే ఆ సమయంలో స్కూటీ యాక్సిలరేటర్ తిప్పడంతో బండి వేగంగా ముందుకు వెళ్తుంది. దీంతో అతను కూడా బండితో పాటే పక్కనే ఉన్న నదిలోకి దూసుకెళ్తాడు. ఊహించని ఈ ఘటనతో అక్కడున్న వారంతా షాక్ అవుతారు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. అయితే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఏదో చేయాలని చూస్తే.. ఇంకేదో అయిందే’’.. అని కొందరు, ‘‘పాపం బండి తోలడం రానట్టుంది’’.. అని మరికొందరు, ‘‘అరెరే.. ఇంతకీ అతడికి ఏమైందీ’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Crime: ఈ కుర్రాడు ఇంత ఘోరం చేశాడంటే అస్సలు నమ్మలేరు.. ఏడాది వయసున్న కొడుకు ఆమెకు ఉన్నాడని తెలిసి కూడా..!

Updated Date - 2023-10-05T19:56:58+05:30 IST