Viral Video: ఎవరో చేసిన తప్పులకు.. ఇంకెవరో బలవడం అంటే ఇదేనేమో.. పాపం తన మానాన తాను నడుచుకుంటూ వెళ్తుండగా..

ABN , First Publish Date - 2023-10-05T15:19:48+05:30 IST

కొన్నిసార్లు కొందరి నిర్లక్ష్యం.. ఇంకొందరికి ప్రాణసంకటం అవుతుంటుంది. ప్రధానంగా రోడ్డు ప్రమాదాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటుంటాయి. నిబంధనలు పాటించకుండా కొందరు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మరికొందరు.. ఊహించని ప్రమాదాలకు కారణమవుతుంటారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉండడంతో...

Viral Video: ఎవరో చేసిన తప్పులకు.. ఇంకెవరో బలవడం అంటే ఇదేనేమో.. పాపం తన మానాన తాను నడుచుకుంటూ వెళ్తుండగా..

కొన్నిసార్లు కొందరి నిర్లక్ష్యం.. ఇంకొందరికి ప్రాణసంకటం అవుతుంటుంది. ప్రధానంగా రోడ్డు ప్రమాదాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటుంటాయి. నిబంధనలు పాటించకుండా కొందరు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మరికొందరు.. ఊహించని ప్రమాదాలకు కారణమవుతుంటారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉండడంతో ఇలాంటి ఘటనలు.. వీడియోల రూపంలో నెట్టింట దర్శనమిస్తుంటాయి. తాజాగా, తమిళనాడు కోయంబత్తూరులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తన మానాన తాను రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. ఉన్నట్టుండి చోటు చేసుకున్న ఊహించని ఘటనతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

తమిళనాడు (Tamil Nadu) కోయంబత్తూరులోని ఆర్ఎస్ పురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన లీలావతి అనే మహిళ (woman) మంగళవారం.. స్థానిక కన్నెడీ థియేటర్ సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. రోడ్డు పక్కన వెళ్తున్న ఆమె.. మరుక్షణంలో ఊహించని ప్రమాదానికి గురవుతుందని ఎవరూ ఊహించలేదు. కాస్త దూరం వెళ్లగానే వెనుక వస్తున్న రెండు కార్లలో.. ముందు వస్తున్న ఓ కారు సడన్‌గా ఎడమ వైపు మళ్లడంతో వెనుక వస్తున్న కారు అదుపు తప్పి మహిళ వైపు దూసుకొచ్చింది. అప్పటిదాకా నడుస్తూ వెళ్తున్న ఆమె.. వెనుక వైపు తిరిగి చూసింది. అప్పటికే కారు తన వైపు వేగంగా రావడాన్ని చూసి షాక్ అయింది. అయితే అప్పటికే కారు సమీపానికి రావడంతో తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. చూస్తుండగానే కారు (car hit the woman) వేగంగా వచ్చి ఆమెను ఢీకొట్టింది. దీంతో ఎగిరి కారు ఇంజిన్‌పై పడింది.

Water Allergy: మంచి నీళ్లు తాగినా.. స్నానం చేసినా ఈ యువతికి అలెర్జీ.. చిన్నప్పటి నుంచి నీళ్లు తాగకుండా ఎలా బతుకుతోందంటే..!

వేగాన్ని అదుపు చేయలేని డ్రైవర్.. ఆమెను ఢీకొని అలాగే చాలా దూరం ముందుకు వెళ్లి ఆపాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమెను.. స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం గాంధీపురంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు.. మహిళను ఢీకొన్న వ్యక్తి ఇదే ప్రాంతానికి చెందిన ఉత్తమ్‌కుమార్‌గా గుర్తించారు. అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇలాంటి డ్రైవర్ల వల్లే.. ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి’’.. అని కొందరు, ‘‘ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’’.. అని మరికొందరు, ‘‘అయ్యో పాపం! ఎంత ఘోరం జరిగింది’’.. అని ఇకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: బాబోయ్.. ఇదెక్కడి వింత..? తలపై ఫ్రిడ్జ్‌ను పెట్టుకుని మోయడమే గొప్ప అనుకుంటే.. ఈ కుర్రాడు ఏం చేస్తున్నాడో చూస్తే..!

Updated Date - 2023-10-05T15:19:48+05:30 IST