Shocking: ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారా..? జర జాగ్రత్త.. 4 ఏళ్ల పిల్లాడు ఎలాంటి పరిస్థితుల్లో చనిపోయాడో తెలిస్తే..!

ABN , First Publish Date - 2023-10-05T18:51:12+05:30 IST

అప్పటిదాకా ఆడుకుంటున్న కొడుకు అంతలోనే మృత్యు ఒడిలోకి జారుకుంటాడని ఎవరూ ఊహించలేదు. ఇంట్లో ఆడుకుంటున్న నాలుగేళ్ల పిల్లాడు తన అక్కకు బై బై చెప్పడానికి బాల్కనీలోకి వచ్చాడు. అయితే అక్క మాత్రం అస్సలు చూడలేదు. చివరకు పెద్ద శబ్ధం వినిపించగానే అంతా..

Shocking: ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారా..? జర జాగ్రత్త.. 4 ఏళ్ల పిల్లాడు ఎలాంటి పరిస్థితుల్లో చనిపోయాడో తెలిస్తే..!

అప్పటిదాకా ఆడుకుంటున్న కొడుకు అంతలోనే మృత్యు ఒడిలోకి జారుకుంటాడని ఎవరూ ఊహించలేదు. ఇంట్లో ఆడుకుంటున్న నాలుగేళ్ల పిల్లాడు తన అక్కకు బై బై చెప్పడానికి బాల్కనీలోకి వచ్చాడు. అయితే అక్క మాత్రం అస్సలు చూడలేదు. చివరకు పెద్ద శబ్ధం వినిపించగానే అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. కళ్ల ముందు పిల్లాడు తీవ్ర గాయాలతో పడి ఉండడం చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. చివరకు ఆ చిన్నారి చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

హర్యానా (Haryana) ఫరీదాబాద్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక డబువా కాలనీకి చెందిన రామ్ అనే వ్యక్తికి భార్య హేమలత, స్నేహ, కవిత, రితిక, మోహిని, చాందిని అనే ఐదుగురు కుమార్తెలు, సార్థక్ అనే 4ఏళ్ల కొడుకు ఉన్నారు. రామ్ స్థానికంగా ఉండే ప్రైవేట్ కంపెనీలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. సంతోషంగా సాగుతున్న వీరి కుటుంబంలో ఉన్నట్టుండి విషాద ఘటన చోటు చేసుకుంది. మంగళవారం సాయంత్రం రామ్ పెద్ద కూరుతు స్నేహ.. ఏదో పని మీద బయటికి వెళ్లింది. దీంతో అక్కకు వీడ్కోలు చేప్పేందుకు తమ్ముడు సార్థక్.. వారు ఉంటున్న రెండో అంతస్థులోని ఇంటి బాల్కనీలోకి వెళ్లాడు. పైనుంచి కిందకు చూస్తూ ‘‘బాయ్.. అక్కా’’.. అంటూ చేయి ఊపుతూ ఉన్నాడు. ఆ సమయంలో అదుపుతప్పి (boy fell from the second floor) ఒక్కసారిగా పైనుంచి కిందపడిపోయాడు.

Crime: ఈ కుర్రాడు ఇంత ఘోరం చేశాడంటే అస్సలు నమ్మలేరు.. ఏడాది వయసున్న కొడుకు ఆమెకు ఉన్నాడని తెలిసి కూడా..!

9382.jpg

వీధి గుండా వెళ్తున్న స్నేహకు తమ్ముడి మాటలు వినిపించలేదు. చివరకు సార్థక్ కిందపడగానే శబ్ధం రావడంతో వెనక్కు తిరిగి చూసింది. కేకలు వేయడంతో చుట్టు పక్కల వారంతా పరుగెత్తుకుంటూ వచ్చారు. కుటుంబ సభ్యులు బాబును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అతడి పరిస్థితి విషయంగా ఉండడంతో ఢిల్లీకి తరలించాలని వైద్యులు సూచించారు. అయితే రామ్‌కు ఈఎస్ఐ సౌకర్యం ఉండడంతో ఇదే ప్రాంతంలోని ఈఎస్ఐ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. ఒక్కగానొక్క కొడుకు ఇలా ఉన్నట్టుండి మృత్యువాత పడడాన్ని తల్లిదండ్రులతో పాటూ స్థానికులూ జీర్ణించుకోలేకున్నారు. ఈఎస్ఐ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కొడుకు చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Viral Video: ఎవరో చేసిన తప్పులకు.. ఇంకెవరో బలవడం అంటే ఇదేనేమో.. పాపం తన మానాన తాను నడుచుకుంటూ వెళ్తుండగా..

Updated Date - 2023-10-05T18:51:12+05:30 IST