నిప్పుల గుండం..
ABN , Publish Date - May 20 , 2026 | 11:58 AM
నిజామాబాద్ జిల్లాపై భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లా అంతటా 44 డిగ్రీల పైనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు
ఉక్కపోతతో జనం బెంబేలు
జిల్లా అంతటా రెడ్ అలర్ట్
నిజామాబాద్: జిల్లాపై భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 8 గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపుతుండడంతో ప్రజలు రోడ్లపైకి వచ్చేందుకు భయపడుతున్నారు. సాయంత్రం 6 గంటల వరకు ఎండ తీవ్రత ఉంటుంది. జిల్లా అంతటా రెడ్ అలర్ట్ వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. జిల్లాలోని 33 మండలాలలో అన్ని మండలాల్లో మంగళవారం 44డిగ్రీలపైనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అత్యధికంగా కమ్మర్‌పల్లి మండలంలో 45.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా పొతంగల్, సాలూర, ఎడపల్లి, నిజామాబాద్, ఆలూరు, మోర్తాడ్, భీంగల్, సిరికొండలలో 45 డిగ్రీలపైనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయంటే పరిస్థితి ఏవిదంగా ఉందో అర్ధమవుతుంది. కాగా, ఈ నెల 25 నుంచి రోహిణికార్తె ప్రారంభమవుతుండడంతో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని అవసరమైతే తప్ప బయటకు రావద్దని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
సరస్వతి అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు పూర్తి: కొండ సురేఖ
బీర్ సీసాలో కండోమ్ ప్యాకెట్ కలకలం..
Read Latest AP News And Telangana News And International News And Telugu News