బాలికను రహస్యంగా పెళ్లాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. చివరకు..
ABN , Publish Date - May 20 , 2026 | 09:17 AM
చట్టాన్ని రక్షించాల్సిన ఒక పోలీస్ కానిస్టేబుల్.. దాన్ని ఉల్లంఘించి బాలికను వివాహం చేసుకున్న ఉదంతం యాదాద్రి భువనగిరి జిల్లాలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..
యాదాద్రి భువనగిరి, మే 20: చట్టాన్ని రక్షించాల్సిన ఒక పోలీస్ కానిస్టేబుల్.. దాన్ని ఉల్లంఘించి బాలికను వివాహం చేసుకున్న ఉదంతం యాదాద్రి భువనగిరి జిల్లాలో కలకలం రేపింది. భువనగిరి పట్టణంలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిన్న నాయిని అనిల్ కుమార్ గౌడ్ అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. వివరాల్లోకి వెళితే.. కానిస్టేబుల్ అనిల్ కుమార్ గౌడ్, ఈ నెల 9వ తేదీ అర్ధరాత్రి సమయంలో అనంతగిరి మండలానికి చెందిన ఒక బాలికను ఎవరికీ తెలియకుండా రహస్యంగా వివాహం చేసుకున్నాడు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని తెలిసి కూడా, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఒక పోలీస్ అధికారి ఈ పని చేయడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో స్పందించిన శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్) అధికారులు హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌పై ఫిర్యాదు చేశారు. అధికారుల ఫిర్యాదు మేరకు నిందితుడు అనిల్ కుమార్ గౌడ్‌పై బాల్య వివాహాల నిరోధక చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
గల్ఫ్ దేశాల విజ్ఞప్తితో ఇరాన్‌పై దాడి వాయిదా.. ట్రంప్ కీలక ప్రకటన
పాపం పాకిస్థాన్.. భారత్‌లో లేని ఎయిర్‌బేస్‌లపై దాడులు చేసిందట..