Share News

గల్ఫ్ దేశాల విజ్ఞప్తితో ఇరాన్‌పై దాడి వాయిదా.. ట్రంప్ కీలక ప్రకటన

ABN , Publish Date - May 19 , 2026 | 03:16 PM

ఇరాన్‌పై జరగాల్సిన సైనిక దాడిని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. గల్ఫ్ దేశాల నేతల విజ్ఞప్తి మేరకు దౌత్య చర్చలకు మరికొంత సమయం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.

గల్ఫ్ దేశాల విజ్ఞప్తితో ఇరాన్‌పై దాడి వాయిదా.. ట్రంప్ కీలక ప్రకటన
Trump Iran attack delay

ఇరాన్‌పై జరగాల్సిన సైనిక దాడిని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. గల్ఫ్ దేశాల నేతల విజ్ఞప్తి మేరకు దౌత్య చర్చలకు మరికొంత సమయం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. యుద్ధం మరింత విస్తరించకుండా చర్చలను కొనసాగించాలని ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాయకులు కోరారని, దాంతో మంగళవారం జరగాల్సిన దాడిని వాయిదా వేసినట్టు ట్రంప్ వెల్లడించారు (Trump Iran attack delay).


ఇరాన్‌పై సైనిక దాడిని వాయిదా వేసినట్టు ట్రంప్ తన సోషల్ మీడియా 'ట్రూత్' ద్వారా వెల్లడించారు. 'ఇరాన్‌పై సైనిక దాడిని వాయిదా వేశాం. సంతృప్తికరమైన ఒప్పందం కుదరకపోతే, పూర్తి స్థాయి భారీ దాడికి అమెరికా సిద్ధంగా ఉంది. ఎప్పుడైనా దాడి చేసేందుకు సిద్ధంగా ఉండాలని అమెరికా సైన్యాన్ని ఆదేశించా' అని ట్రంప్ పేర్కొన్నారు (Gulf allies Iran war).


ఇటీవల ఇరాన్ నుంచి వచ్చిన కొత్త శాంతి ప్రతిపాదన, పాకిస్థాన్ మధ్యవర్తిత్వ ప్రయత్నాలు కూడా దాడిని వాయిదా వేయాలనే నిర్ణయంలో కీలక పాత్ర పోషించినట్లు అమెరికా మీడియా పేర్కొంది (Donald Trump Iran strike). ప్రస్తుతం ఇరు దేశాల మధ్య అణు చర్చలు, హోర్ముజ్ జలసంధి భద్రత, ఆంక్షల సడలింపులపై చర్చలు కొనసాగుతున్నాయి. ఇరాన్ అణ్వాయుధాలు అభివృద్ధి చేయకూడదన్న విషయంలో మాత్రం అమెరికా కఠిన వైఖరిని కొనసాగిస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి...

బుల్లెట్ వేగంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్లాంట్.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

భవిష్యత్తు న్యూక్లియర్ రంగంలో ఏపీ కీలక పాత్ర పోషిస్తుంది: నారా లోకేశ్

Updated Date - May 19 , 2026 | 03:20 PM