ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.. పవన్ కల్యాణ్‌కు కేంద్రమంత్రి సూచన
ABN , Publish Date - May 19 , 2026 | 02:39 PM
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోగ్యం గురించి కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఫోన్ చేసి ఆరా తీశారు. ఇటీవల పవన్ కల్యాణ్‌కు శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అమరావతి, మే 19 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆరోగ్యం గురించి కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి (Pralhad Joshi) ఫోన్ చేసి ఆరా తీశారు. ఇటీవల పవన్ కల్యాణ్‌కు శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కొన్నిరోజుల క్రితం పవన్ కల్యాణ్‌కు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో ముక్కుకు సంబంధించిన శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే.
వైద్యుల సూచన మేరకు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ‘మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యం అన్నిటికన్నా ముఖ్యం. మీ ఆరోగ్యం బాగుంటేనే ప్రజల కోసం మరింత సమర్థంగా పని చేయగలుగుతారు’ అంటూ పవన్ కల్యాణ్‌ను ఫోన్‌లో ప్రహ్లాద్ జోషి పరామర్శించారు. రాజకీయ బాధ్యతలతో పాటు వ్యక్తిగత ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. పవన్ కల్యాణ్ త్వరగా కోలుకొని మళ్లీ ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు. ‘నేను ఆంధ్రప్రదేశ్‌కు వచ్చినప్పుడు తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను’ అని డిప్యూటీ సీఎంకు చెప్పారు. అంతేకాకుండా పవన్ ఆరోగ్యం కోసం తాను తిరుపతి బాలాజీని ప్రార్థిస్తున్నానని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
బుల్లెట్ వేగంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్లాంట్.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
భవిష్యత్తు న్యూక్లియర్ రంగంలో ఏపీ కీలక పాత్ర పోషిస్తుంది: నారా లోకేశ్
భార్యను అడ్డుపెట్టుకొని పేర్ని నాని బతికిపోయారు.. మంత్రి పార్థసారథి షాకింగ్ కామెంట్స్
Read Latest AP News And Telangana News And International News And Telugu News