సరస్వతి అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు పూర్తి: కొండ సురేఖ
ABN , Publish Date - May 20 , 2026 | 11:00 AM
సరస్వతి అంత్య పుష్కరాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. ఈ పుష్కరాలకు వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు. బుధవారం వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో కంచి పీఠాధిపతి విజయేంద్రస్వామితో కలిసి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వరంగల్, మే 20: సరస్వతి అంత్య పుష్కరాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. ఈ పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు. బుధవారం వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో కంచి పీఠాధిపతి విజయేంద్రస్వామితో కలిసి కొండ సురేఖ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం దేవాలయం బయట మంత్రి కొండా సురేఖ విలేకర్లతో మాట్లాడుతూ.. ఈ అంత్య పుష్కరాలకు రూ. 200 కోట్లకు పైగా నిధులు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని వివరించారు. రోజుకు ఒక స్వామీజీ స్నానంతో ఈ పుష్కరాలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ పుష్కరాలు జరిగే ఈ పది రోజులు.. 10 మంది పీఠాధిపతులు వస్తారని వివరించారు. కాళేశ్వరంలో జరిగే ఈ సరస్వతి పుష్కరాల్లో ప్రతి రోజు సాయంత్రం గోదావరి హారతి ఇస్తారని చెప్పారు.
అలాగే ఈ పుష్కరాల సందర్భంగా పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశామని కొండా సురేఖ వివరించారు. ఈ పుష్కరాల సందర్భంగా భక్తులకు పెద్ద ఎత్తున సేవలందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బాసర నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం వరకు దేవాలయాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు.
గురువారం నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. మే 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు మొత్తం 12 రోజుల పాటు ఈ అంత్య పుష్కరాలు జరుగనున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రేమ జంటకు కుల పెద్దల జరిమానా.. ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు
For More TG News And Telugu News