Share News

ప్రేమ జంటకు కుల పెద్దల జరిమానా.. ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు

ABN , Publish Date - May 20 , 2026 | 07:10 AM

ప్రేమ వివాహం చేసుకున్నారంటూ ఓ జంటతోపాటు ఆ కుటుంబాన్ని కుల పెద్దలు వెలేశారు. అంతేకాకుండా.. గ్రామ ప్రజలపై కూడా కుల పెద్దలు తీవ్ర ఆంక్షలు విధించారు.

ప్రేమ జంటకు కుల పెద్దల జరిమానా.. ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు
Mylavaram police Station

విజయవాడ, మే 20: ప్రేమ వివాహం చేసుకున్నారంటూ ఓ జంటతోపాటు ఆ కుటుంబాన్ని కుల పెద్దలు వెలేశారు. అంతేకాకుండా.. గ్రామ ప్రజలపై కూడా కుల పెద్దలు తీవ్ర ఆంక్షలు విధించారు. పోలీసులకు ఆ జంట ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఎస్పీలు స్పందించి తమకు న్యాయం చేయాలని ఆ జంట విజ్ఞప్తి చేస్తోంది. ఈ దారుణమైన ఘటన ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురం గ్రామంలో చోటు చేసుకుంది.


ఈ గ్రామానికి చెందిన నాగలక్ష్మీని తేజ అనే వ్యక్తి ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరి కులాలు వేరు కావడంతో.. ఆ గ్రామంలోని కుల పెద్దలు ఆగ్రహించారు. దీంతో ఆ జంటతోపాటు నాగలక్ష్మీ కుటుంబాన్ని వెలివేశారు. వారికి ఎటువంటి సాయం చేయరాదని గ్రామ ప్రజలకు కుల పెద్దలు నిబంధన విధించారు. ఈ నిబంధన అతిక్రమిస్తే.. రూ. 2 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని గ్రామ ప్రజలను హెచ్చరించారు.


ఈ నేపథ్యంలో ఈ ప్రేమ జంట మరో ఉరు వెళ్లి జీవనం కొనసాగిస్తోంది. ఇటీవల ఈ జంటకు బాబు జన్మించాడు. దీంతో బాబు బారసాలకు రావాలంటూ ఆ ఉరిలోని బంధువుల ఇళ్లకు వెళ్లి ఆ జంట స్వయంగా ఆహ్వానించింది. ఆ బారసాలకు వెళ్లకూడదంటూ గ్రామస్తులకు కుల పెద్దలు చాటింపు ద్వారా ప్రకటించారు.


అయితే నిబంధనలు అతిక్రమించి ఉరిలోకి ప్రవేశించారని.. రూ. 2 లక్షల జరిమానా చెల్లించాలంటూ ఆ జంటకు కుల పెద్దలు జరిమానా విధించారు. దీంతో మైలవరం పోలీసులను ఆ జంట ఆశ్రయించింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా వారి నుంచి స్పందన కరువైందని ఆ జంట ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంలో స్పందించి తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఆ జంట విజ్ఞప్తి చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

తాటి చెట్టుకాదు.. కల్పవృక్షం

జలమండలి జీఎం రూ.100 కోట్లు

For More AP News And Telugu News

Updated Date - May 20 , 2026 | 07:23 AM