హెచ్చరిక.. రానున్న మూడుగంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షం
ABN , Publish Date - Jun 07 , 2026 | 04:33 PM
ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వచ్చే మూడు గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
విశాఖపట్నం, జూన్7 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వచ్చే మూడు గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు (AP Rain Alert) కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉండటంతో రైతులు, మత్స్యకారులు, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కింద నిలబడకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో పలు జిల్లాల్లో ఈ వర్షపాతం నమోదవుతోందని అధికారులు వెల్లడించారు. రాబోయే మూడు గంటల్లో స్థానికంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న ప్రాంతాల్లో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని అధికారులు తెలిపారు.
ఈ జిల్లాల్లో వర్షాలు..
విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
గొడ్డలి పార్టీ ఆగడాలు శ్రుతిమించితే వదిలిపెట్టం.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
జగన్ హయాంలో ఎన్నో అరాచకాలు, అక్రమాలకు పాల్పడ్డారు: హోంమంత్రి అనిత
Read Latest Telangana News And AP News And National News
And Telugu News