హైదరాబాద్‌లో భారీ వర్షం.. పలు ప్రాంతాలు జలమయం
ABN , Publish Date - Jun 18 , 2026 | 08:28 PM
భాగ్యనగరంలో గురువారం భారీ వర్షం కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. పలుచోట్ల రహదారులు నీటమునిగిపోగా, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
హైదరాబాద్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): భాగ్యనగరంలో గురువారం భారీ వర్షం కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. పలుచోట్ల రహదారులు నీటమునిగిపోగా, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షపు నీరు రోడ్లపై నిల్వ ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నగరంలోని పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, టోలిచౌకి, యూసఫ్‌గూడ, బోరబండ, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, మియాపూర్, సికింద్రాబాద్, మాదాపూర్, హైటెక్ సిటీ, నల్లగండ్ల ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా ప్రధాన రహదారులపై ట్రాఫిక్ జాం నెలకొంది. ముఖ్యంగా ఐటీ కారిడార్ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షపు నీరు కాలనీల్లోకి చేరడంతో కొన్ని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ, అవసరమైన చోట్ల సహాయక చర్యలు చేపడుతున్నారు. హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో మరికొన్ని గంటల పాటు మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని, నీటితో నిండిన రహదారులపై జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
తెలంగాణలో మేలుజాతి వంగడాల సాగుకు ప్రోత్సాహం కల్పిస్తాం: భట్టి విక్రమార్క
అభిమాని కోరిక తీర్చిన పవన్ కల్యాణ్.. నిరంజన్ ఇంటికి కుక్కపిల్ల పంపించిన జనసేనాని
Read Latest AP News And Telangana News And National News
And Telugu News