రెయిన్ అలర్ట్.. నెల్లూరు జిల్లాలో వర్షాలు కురిసే ఛాన్స్
ABN , Publish Date - Nov 23 , 2026 | 05:30 PM
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనంతో నెల్లూరు జిల్లాలోని పలుచోట్ల సోమవారం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నగరంలో తేలికపాటి జల్లులు కురుస్తాయని వెల్లడించారు.
నెల్లూరు జిల్లా, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనంతో నెల్లూరు జిల్లాలో పలుచోట్ల ఈరోజు (సోమవారం) తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నగరంలో తేలికపాటి జల్లులు కురుస్తాయని వెల్లడించారు. వర్షాల నేపథ్యంలో జనజీవనానికి, ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చారు.
మరో రెండు, మూడు రోజులు కూడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని అధికారులు వివరించారు. సముద్రంలో రెండు నెలలుగా చేపలవేట పూర్తిగా నిలిచిపోయిందని తెలిపారు. సోమశిల, కండలేరు డ్యామ్‌లలో 18 నుంచి 19 టీఎంసీల నీటి లభ్యత ఉందని చెప్పారు. నెల్లూరు జిల్లాలో 25 నుంచి 75 శాతం చెరువులు నిండాయని అధికారులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
గ్రామాల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి: పవన్ కల్యాణ్
వైసీపీకి మిగిలేది కక్షలు, అప్పులే.. సోమిరెడ్డి సెటైర్లు
ఏపీలో మేయర్లు, ఛైర్‌పర్సన్ల ప్రమాణ స్వీకారానికి వేళాయే..
Read Latest AP News And Telangana News And National News
And Telugu News