Share News

రెయిన్ అలర్ట్.. ఏపీలో 4 రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్

ABN , Publish Date - Nov 24 , 2026 | 04:02 PM

బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. రాష్ట్రంలో మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు.

రెయిన్ అలర్ట్.. ఏపీలో 4 రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్
AP Weather Alert

అమరావతి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. రాష్ట్రంలో మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు.


రేపు (బుధవారం) 14 జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ చెప్పుకొచ్చారు. మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో వానలు కురిసే ఛాన్స్ ఉందని వివరించారు. శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మిగతా జిల్లాల్లోనూ చెదురుముదురుగా తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పారు. మెరుపులు, ఈదురుగాలులతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల కింద నిలబడవద్దని హెచ్చరించారు.


ఈరోజు (మంగళవారం) సాయంత్రం 3 గంటల వరకు నెల్లూరు జిల్లా కొండాపురంలో అత్యధికంగా 39.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో 34.4 మిల్లీమీటర్లు, కావలిలో 34.2 మిల్లీమీటర్లు, మారెళ్లలో 33.5 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్టు అయిందని వెల్లడించారు. త్రిపురాంతకంలో 27.9 మిల్లీమీటర్లు, నెల్లూరులో 27.5 మిల్లీమీటర్లు, ములుకుదురులో 26 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

పౌరసేవల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టండి: సీఎం చంద్రబాబు

ఏపీని మారిటైం, ఇండస్ట్రీయల్ హబ్‌గా అభివృద్ధి చేస్తాం: మంత్రి లోకేశ్

నీటి వాటాలపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య కుదరని ఏకాభిప్రాయం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 24 , 2026 | 04:29 PM