ద్రోణి ప్రభావం.. ఏపీలో రెండు రోజుల పాటు వర్షాలు
ABN , Publish Date - Sep 08 , 2026 | 07:04 PM
తెలంగాణ - రాయలసీమ - తమిళనాడు మీదుగా ద్రోణి ప్రభావ కొనసాగుతోందని ఏపీ వాతావరణ, విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు అలర్ట్ జారీ చేశారు.
అమరావతి, సెప్టెంబర్ 8 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ - రాయలసీమ - తమిళనాడు మీదుగా ద్రోణి ప్రభావ కొనసాగుతోందని ఏపీ వాతావరణ, విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు అలర్ట్ జారీ చేశారు. ఏపీలో రేపు (బుధవారం) పలు జిల్లాలకు వర్ష హెచ్చరిక జారీ చేసినట్లు తెలిపారు. కోస్తాంధ్రపై ఉపరితల ఆవర్తనం ప్రభావం ఉందని వెల్లడించారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో మోస్తరు వర్షాలు, పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లా, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వివరించారు.
గుంటూరు జిల్లా , బాపట్ల జిల్లా , పల్నాడు జిల్లా, మార్కాపురంలో వర్ష సూచనలు ఉంటాయని అన్నారు. నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లాల్లో కూడా వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. ఆకస్మిక వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తాడేపల్లిగూడెంలో అత్యధికంగా 52.5 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదవుతుందని తెలిపారు. పెరికగూడెంలో 31.3 మిల్లిమీటర్ల వర్షం నమోదవుతుందని, పెంటపాడులో 27.6 మిల్లిమీటర్ల వర్షపాతం, చందర్లపాడు, పండ్రపాడులో 24 మిల్లిమీటర్ల చొప్పున వర్ష పాతం నమోదవుతుందని అధికారులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సమర్థ నాయకత్వంతోనే సమస్యల పరిష్కారం: సీఎం చంద్రబాబు
గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారతకు స్వర్ణభారత్ ట్రస్ట్ కృషి అమోఘం: యోగి ఆదిత్యానాథ్
పార్టీ అప్పగించిన పనులను తప్పనిసరిగా పూర్తి చేయాల్సిందే: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News