అల్పపీడనం ప్రభావం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు
ABN , Publish Date - Sep 09 , 2026 | 05:48 PM
ఉత్తర బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో మూడు రోజుల పాటు ఏపీకి వర్ష సూచన ఉందని తెలిపారు.
అమరావతి, సెప్టెంబర్ 9 (ఆంధ్రజ్యోతి): ఉత్తర బంగాళాఖాతంలో రేపు (బుధవారం) అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో మూడు రోజుల పాటు ఏపీకి వర్ష సూచన ఉందని తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మేఘావృత వాతావరణం, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. వానల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈదురుగాలుల సమయంలో చెట్ల కింద, హోర్డింగ్స్ వద్ద ప్రజలు నిలబడవద్దని నిర్దేశించారు.
రేపు (గురువారం) శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాలో మోస్తరు వర్ష సూచన ఉందని అధికారులు తెలిపారు. పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరిలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని చెప్పారు. తిరుపతి జిల్లాలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని వెల్లడించారు. మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు పడతాయని చెప్పుకొచ్చారు. శుక్రవారం (11 సెప్టెంబర్) ఉత్తరాంధ్రలో మేఘావృత వాతావరణం కొనసాగనుందని వెల్లడించారు. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వివరించారు.
మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. శనివారం (12 సెప్టెంబర్) విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో వర్ష సూచన ఉందని చెప్పారు. ఈ క్రమంలో అల్లూరి, పోలవరం, అనకాపల్లి జిల్లాలకు వర్ష హెచ్చరికలు చేశారు. కాకినాడ జిల్లాలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గొడ్డలి పార్టీ దుష్ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఊపేక్షించొద్దు: సీఎం చంద్రబాబు
హస్తకళలను గ్లోబల్ మార్కెట్లకు అనుసంధానించేలా చర్యలు: పవన్ కల్యాణ్
నేతలు సోషల్ మీడియాను సమర్థంగా వినియోగించాలి: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News