అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు
ABN , Publish Date - Sep 12 , 2026 | 04:08 PM
దక్షిణ ఛత్తీస్‌గఢ్, దాని పరిసర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
అమరావతి, సెప్టెంబర్ 12 (ఆంధ్రజ్యోతి): దక్షిణ ఛత్తీస్‌గఢ్, దాని పరిసర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ అల్పపీడనం రాబోయే 24 గంటల్లో విదర్భ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వానలు పడే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.
అల్లూరిసీతారామరాజు జిల్లా, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వానలు పడతాయని వివరించారు. పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ వర్షాలతోపాటు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చెట్లు, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నేత్రపర్వంగా ఖైరతాబాద్ మహాగణపతి ఆగమన్
చేయూత పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
రెజిమెంట్‌లో ఆయుధాలు చోరీ చేసింది వీరే.. కీలక వివరాలు వెల్లడించిన డీజీపీ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News