మహేశ్వరరెడ్డి కేసులో తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి అరెస్ట్
ABN, Publish Date - May 26 , 2026 | 12:34 PM
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో తీవ్ర రాజకీయ కలకలం రేగుతోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి (రాజారెడ్డి)ని పోలీసులు అరెస్ట్ చేశారు.
అనంతపురం జిల్లా, మే 26 (ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో తీవ్ర రాజకీయ కలకలం రేగుతోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి (రాజారెడ్డి) ని పోలీసులు అరెస్ట్ చేశారు. గత సంవత్సరం అనుమానాస్పద స్థితిలో తోపుదుర్తి మహేశ్వరరెడ్డి మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే, మహేశ్వరరెడ్డిని తోపుదుర్తి సోదరులే హత్య చేశారంటూ ఆయన కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసులోనే తోపుదుర్తి రాజశేఖరరెడ్డి, జైపాల్‌రెడ్డిలని అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ఎదుట పోలీసులు హాజరపరిచారు. 14 రోజుల పాటు మేజిస్ట్రేట్ వారికి రిమాండ్ విధించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్‌లను ప్రోత్సహిస్తాం: సీఎం చంద్రబాబు
గోదావరి పుష్కరాల పనుల్లో జాప్యం.. అధికారుల తీరుపై పవన్ అసహనం
Read Latest AP News And Telangana News And International News And Telugu News
Updated at - May 26 , 2026 | 12:35 PM