Share News

రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్‌లను ప్రోత్సహిస్తాం: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - May 25 , 2026 | 02:05 PM

రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్‌లను ప్రోత్సహిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఏపీ నుంచి వంద యునికార్న్ సంస్థలు ఏర్పాటు చేయాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు.

రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్‌లను ప్రోత్సహిస్తాం: సీఎం చంద్రబాబు
AP CM Chandrababu Naidu

అమరావతి, మే 25 (ఆంధ్రజ్యోతి): రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్‌లను ప్రోత్సహిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. ఏపీ నుంచి వంద యునికార్న్ సంస్థలు ఏర్పాటు చేయాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. వచ్చేది నాలెడ్జ్ ఎకానమీ దీనిని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. విలేజ్ టు గ్లోబల్ మార్కెట్ అనేది తమ ప్రభుత్వ నినాదమని ఉద్ఘాటించారు. ఒక పరిశ్రమ వ్యర్థాలు.. మరో పరిశ్రమకు ముడి సరుకుగా మారుతుందని వివరించారు. సర్క్యులర్ ఎకానమీ వ్యవస్థ, ఎంఎస్ఎంఈ ఎకో సిస్టమ్ తయారు కావాలని ఆకాంక్షించారు. ఈరోజు (సోమవారం) విజయవాడలో ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ - 2026 జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు.


ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తున్న రంగం ఇదే..

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరిట ఓ కళావేదికను ఇవాళ ప్రారంభించుకుని ఎంఎస్ఎంఈ సమ్మిట్ - 2026 నిర్వహిస్తున్నామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. 4.4 ఎకరాల్లో 1.45 చదరపు అడుగుల స్థలంలో ఈ కన్వెన్షన్ సెంటర్ నిర్మించామని తెలిపారు. ఓ చిన్న ఆలోచనను పెద్ద పరిశ్రమగా మార్చే అవకాశం ఎంఎస్ఎంఈలకు మాత్రమే ఉందని ప్రస్తావించారు. దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తున్న రంగం ఇదేనని చెప్పుకొచ్చారు. ఏపీలో వనరులు వినియోగించుకునేలా ఎంఎస్ఎంఈలకు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు.


రూ.200 కోట్లతో క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ప్రారంభిస్తున్నాం..

ఎంఎస్ఎంఈ పాలసీతో పాటు ప్రైవేటు పారిశ్రామిక పార్కుల పాలసీలు తీసుకువచ్చామని సీఎం పేర్కొన్నారు. ఈ సమ్మిట్ ద్వారా స్టార్టప్‌లు, పారిశ్రామిక యూనిట్‌లు, నిపుణులు, బ్యాంకులు ఒకే వేదికపైకి వచ్చాయని వివరించారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ కింద పెద్ద ఎత్తున పారిశ్రామిక యూనిట్‌లు ఏర్పాటు కావాలని సూచించారు. రూ.500 కోట్ల మేర పారిశ్రామిక ప్రోత్సాహకాలు కూడా ఇప్పటికే విడుదల చేశామని చెప్పుకొచ్చారు. రూ.200 కోట్లతో క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కూడా ప్రారంభిస్తున్నామని వివరించారు.


ప్రతీ నియోజకవర్గంలో ఒక ఏంఎస్ఎంఈ పారిశ్రామిక పార్క్..

ప్రతీ నియోజకవర్గంలో ఒక ఏంఎస్ఎంఈ పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇవాళ శంకుస్థాపన చేసిన 38 పార్కులతో పాటు వందపార్కులకు ఇప్పటికే శంకుస్థాపన చేశామని ప్రస్తావించారు. ఎలాంటి వివాదాలు లేకుండా ఈ పారిశ్రామిక పార్కులకు భూములు ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రైవేటు పారిశ్రామిక పార్కులకు కూడా ఇన్సెంటివ్స్ ఇస్తామని స్పష్టం చేశారు. శ్రీసిటీ విజయవంతమైన పారిశ్రామిక పార్క్ అని చెప్పుకొచ్చారు. రూ.28 వేల కోట్ల కార్పస్ ఫండ్ డ్వాక్రా మహిళల సంఘాల వద్ద ఉందని తెలిపారు. ఈ ఏడాది 5 లక్షల మంది డ్వాక్రా సంఘాల మహిళలను ఎంటర్ ప్రెన్యుర్లుగా మారుస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

రక్తచరిత్ర ఎవరిదో ప్రజలకు తెలుసు.. జగన్ అండ్ కోపై మంత్రి నారాయణ ధ్వజం

కూటమి ప్రభుత్వంలో పేదల ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తున్నాం: మంత్రి అనగాని

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 25 , 2026 | 02:18 PM