తెలంగాణ రాజకీయాల్లో వేడి.. కేంద్ర నిధుల వివాదంపై సీఎం రేవంత్‌రెడ్డి VS బీజేపీ నేతల మాటల యుద్ధం
ABN, Publish Date - Jun 22 , 2026 | 10:44 AM
నిధులు, కేటాయింపుల విషయంలో తెలంగాణకు కేంద్రప్రభుత్వం అన్యాయం చేస్తోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం, భారతీయ జనతా పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది.
నిధులు, కేటాయింపుల విషయంలో తెలంగాణకు కేంద్రప్రభుత్వం అన్యాయం చేస్తోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం, భారతీయ జనతా పార్టీ (BJP) నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఈ క్రమంలోనే వరంగల్, ఖమ్మం నగరపాలక సంస్థలకు ఈ ఏడాది ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లను నిర్వహించాలని కాంగ్రెస్ సర్కార్ ఆలోచన చేస్తోంది. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి దూకుడుగా ముందుకు సాగుతూ బీజేపీ లక్ష్యంగా చేస్తున్న విమర్శలు ప్రజల్లోకి వెళ్తున్నాయి.హైదరాబాద్ మైట్రో రైల్ ప్రాజెక్ట్ రుణానికి కేంద్రప్రభుత్వం మోకాలడ్డుతోందన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. రాష్ట్రానికి నిధులు ఇచ్చే విషయంలోనూ వివక్ష చూపుతోందని విమర్శిస్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి.
పూర్తి వీడియో కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి..
ఈ వార్తలు కూడా చదవండి...
ఆరోగ్యానికి యోగానే ఉత్తమ మార్గం: బండి సంజయ్
ఆరోగ్య తెలంగాణకు యోగానే మార్గం: మంత్రి పొన్నం ప్రభాకర్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News
Updated at - Jun 22 , 2026 | 10:52 AM