రేపటితో రేవంత్ సర్కార్ 1000 రోజుల పాలన పూర్తి
ABN, Publish Date - Aug 31 , 2026 | 05:12 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సర్కార్ రేపటితో వెయ్యిరోజుల మైలురాయిని పూర్తి చేసుకుంటుంది.
ఇంటర్నెట్ డెస్క్, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సర్కార్ రేపటితో వెయ్యిరోజుల మైలురాయిని పూర్తి చేసుకుంటుంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలనను అందించడం సంక్షేమానికి.. సామాజిక న్యాయానికి పెద్దపీట వేయడం రైతు యువజన మహిళా శ్రేయస్సుకు ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర సంపదను పెంచడమే లక్ష్యంగా ప్రజాపాలన దూసుకెళ్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది.
తెలంగాణకు భారీ పెట్టుబడులు రావడంతో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు నిర్మించడంలో రేవంత్‌రెడ్డి సర్కార్ 1000 రోజుల పాలన కొత్త అధ్యాయాన్ని నమోదు చేసిందని రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. సంక్షేమ పథకాల అమలుతో పాటు వ్యవసాయం, మహిళా సాధికారత, విద్య, వైద్యం, ఉద్యోగ కల్పన, సామాజిక న్యాయం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలపై ఈ కాలంలో ప్రధానంగా దృష్టిసారించినట్లు రేవంత్‌రెడ్డి సర్కార్ ప్రకటించింది.
ఇవి కూడా చదవండి..
‘టాక్సిక్’లో అసభ్యత తప్ప సమాజానికి ఉపయోగపడే సందేశం లేదు: రాజాసింగ్
వికారాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News
Updated at - Aug 31 , 2026 | 05:13 PM