భూ సమస్యకు శాశ్వత పరిష్కారంగా 'మీ భూమి-బ్లాక్ చెయిన్' వ్యవస్థ
ABN, Publish Date - Jul 23 , 2026 | 10:15 AM
భూ రికార్డుల నిర్వహణలో సాంకేతిక విప్లవానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖల్లో విడివిడిగా ఉన్న భూ సమాచారాన్ని ఒకే వేదికపైకి తీసుకురానుంది.
ఇంటర్‌నెట్ డెస్క్, జులై 23 (ఆంధ్రజ్యోతి): భూ రికార్డుల నిర్వహణలో సాంకేతిక విప్లవానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖల్లో విడివిడిగా ఉన్న భూ సమాచారాన్ని ఒకే వేదికపైకి తీసుకురానుంది. రాష్ట్రంలోని భూ రికార్డులకు సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్‌గా నిలిచే ‘మీ భూమి-బ్లాక్ చెయిన్’ వ్యవస్థను సీఎం నారా చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం ఈ కార్యక్రమం జరగనుంది. మొదటి దశలో ఏడు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఇది అమలు కానుంది.
కర్నూలు, చిత్తూరు, బాపట్ల, కృష్ణా, తూర్పుగోదావరి, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల కలెక్టర్లు వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రస్తుతం వెబ్‌ల్యాండ్ ద్వారా భూ రికార్డులు డిజిటలైజ్ అయినప్పటికీ, రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖల్లో సమాచారం వేర్వేరుగా ఉండటంతో డేటా వ్యత్యాసాలు, రికార్డుల్లో మార్పులను గుర్తించడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా మీ భూమి-బ్లాక్ చెయిన్ వ్యవస్థను రూపొందించారు. ఇకపై ఏ అధికారి, ఎప్పుడు లావాదేవీలు నిర్వహించారనే వివరాలు కూడా శాశ్వతంగా రికార్డుల్లో ఉంటాయి.
ఈ వార్తలు కూడా చదవండి...
ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీ కీలక ప్రాజెక్టులపై చర్చ
తమ్మినేని సీతారాం భూ భాగోతాలపై విచారణ చేస్తున్నాం: అచ్చెన్నాయుడు
ఆ మైదానంలో ఆక్రమణలు లేకుండా చర్యలు: మంత్రి టీజీ భరత్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News
Updated at - Jul 23 , 2026 | 11:05 AM