విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన.. ఇళ్ల పట్టాల పంపిణీ
ABN, Publish Date - Sep 19 , 2026 | 08:12 AM
పేదల సొంతింటి కల సహకారం కానుంది. ఇళ్లపై హక్కుల కోసం దశాబ్దాలుగా పేదలు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో 2845 కుటుంబాలకు వాటిపై సంపూర్ణ హక్కు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం విశాఖపట్నంలో పట్టాలను పంపిణీ చేయనున్నారు.
ఇంటర్నెట్ డెస్క్, సెప్టెంబర్ 19 (ఆంధ్రజ్యోతి): పేదల సొంతింటి కల సహకారం కానుంది. ఇళ్లపై హక్కుల కోసం దశాబ్దాలుగా పేదలు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో 2845 కుటుంబాలకు వాటిపై సంపూర్ణ హక్కు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు (శనివారం) వైజాగ్‌లో పట్టాలను పంపిణీ చేయనున్నారు. విశాఖపట్నం జిల్లాలోని 11 మండలాల్లో 399 ఎకరాల పరిధిలో 19,33,853 చదరపు గజాల ప్రభుత్వ స్థలంలో ఆయా కుటుంబాలను ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నాయి. దాదాపు 8874కోట్ల విలువైన ఈ భూములను పేదలకు క్రమబద్ధీకరించి ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడం ఏపీలో ఇదే తొలిసారి.
ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన సమీక్షలో ఈ అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అభ్యంతరాలు లేని చోట్ల క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. దీంతో విశాఖ జిల్లాలో దశాబ్దాలుగా పెండింగ్‌లోని సమస్యను పరిష్కరించనున్నారు. 2017 నుంచి 2019 మధ్య సుమారు 22 వేల మందికి చంద్రబాబు పట్టాలను పంపిణీ చేశారు. వారికి రెండేళ్ల తర్వాత పూర్తి హక్కులు లభించేలా కన్వయన్స్ డీడ్లు జారీ చేయాల్సి ఉండగా 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోలేదు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశంపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. ముఖ్యమంత్రి చేతులమీదుగా ఇవాళ కన్వియన్స్ డీడ్ల పట్టాల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దశాబ్దాల నిరీక్షణకు తెర.. 25 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్న సీఎం
ఒరిజినల్ రెడ్ల ఆత్మగౌరవం కాపాడేలా పార్టీ పెడతా: విజయసాయి
దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్.. ఎండీఎల్‌తో ఏపీ సర్కార్ ఎంఓయూ
Read Latest AP News And Telangana News And National News
And Telugu News
Updated at - Sep 19 , 2026 | 08:17 AM