ఏపీ అభివృద్ధిని ట్రాక్‌లో పెట్టాం: సీఎం చంద్రబాబు
ABN, Publish Date - May 07 , 2026 | 11:51 AM
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిని ట్రాక్‌లో పెట్టామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. పెట్టుబడుల కోసం 28 ఉత్తమ విధానాలు తీసుకువచ్చామని పేర్కొన్నారు.
అమరావతి, మే 7 (ఆంధ్రజ్యోతి): కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిని ట్రాక్‌లో పెట్టామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. పెట్టుబడుల కోసం 28 ఉత్తమ విధానాలు తీసుకువచ్చామని పేర్కొన్నారు. గ్రీన్‌ఎనర్జీ, డేటా సెంటర్ పెట్టుబడుల గమ్యస్థానంగా ఏపీ ఉందని ఉద్ఘాటించారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఈరోజు (గురువారం) సచివాలయంలో జరుగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు.
ఇప్పటివరకు రూ.23లక్షల కోట్ల ఎంవోయూలు పూర్తి చేశామని వివరించారు. ఇప్పటికే జరిగిన ఎంవోయూల ద్వారా 24లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని వెల్లడించారు. దేశంలోని అతిపెద్ద కంపెనీలన్నీ ఏపీలో ఏర్పాటు కాబోతున్నాయని తెలిపారు. వారానికో కంపెనీ తీసుకొస్తున్నామని.. రోజుకో శంకుస్థాపన చేస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
రాజకీయాల్లో విలువలు లేని పార్టీ వైసీపీ: మంత్రి డీబీవీ స్వామి
జగన్ అండ్ కో క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు.. పల్లా శ్రీనివాసరావు ధ్వజం
భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక నిర్ణయాలివే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News
Updated at - May 07 , 2026 | 11:52 AM