దారి మళ్లుతున్న వంట గ్యాస్
ABN , Publish Date - Nov 18 , 2026 | 12:03 PM
వంటగ్యాస్ దందా జోరుగా సాగుతోంది. ఇళ్లల్లో ఉండాల్సిన సిలిండర్లు హోటళ్లకు తరలుతున్నాయి. కొన్నిగ్యాస్ ఏజన్సీలు ఈ అక్రమ దందాకు తెరలేపుతున్నాయి.
హోటళ్లకు తరలుతున్న వంటింటి సిలిండర్లు
అక్రమ దందాకు తెరలేపిన ఏజెన్సీలు
రెట్టింపు ధరకు అమ్ముకుంటున్న నిర్వాహకులు
వరంగల్: వంటగ్యాస్ దందా జోరుగా సాగుతోంది. ఇళ్లల్లో ఉండాల్సిన సిలిండర్లు హోటళ్లకు తరలుతున్నాయి. కొన్నిగ్యాస్ ఏజన్సీలు ఈ అక్రమ దందాకు తెరలేపుతున్నాయి. హోట ళ్లు, టిఫిన్ సెంటర్ల అవసరాన్ని ఆసరాగా చేసుకొని గ్యాస్ ఏజెన్సీలు రెట్టింపు ధరకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు ఉన్నవారు కూడా తక్కువ ధరకు లభించే డొమెస్టిక్ సిలిండర్ల వైపు మొగ్గు చూపు తుండటంతో ఈ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. పశ్చిమాసియా యుద్ధం తర్వాత గ్యాస్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో వంటింటి గ్యాస్ హోటల్ దారి పట్టింది. డొమెస్టిక్ ధర రూ.1013, కమర్షియల్ సిలిండర్ల ధర రూ.3081కు పెరిగాయి.
డొమెస్టిక్ సిలిండర్‌కు కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌కు మధ్య రూ.2068 తేడా ఉండటంతో హోటల్ వ్యాపారులు తమ కు తెలిసిన వారి ద్వారా, గ్యాస్ ఏజన్సీల ద్వారా గృహ సిలిండర్లను తెప్పించుకొని వినియోగిస్తు న్నా రు. అంతేగాకుండా గ్యాస్ ఏజన్సీల్లోని కొందరు తమకు తెలిసిన వారి పేరిట డొమెస్టిక్ గ్యాస్ బుకింగ్ చేసి హోటల్ నిర్వాహకులకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తెలిసింది.
ఆదాయానికి గండి..
వాణిజ్య అవసరాలకు అనువైన సిలిండర్లకు బదులుగా గృహ వినియోగ సిలిండర్లను వ్యాపార అవసరాలకు ఉపయో గించడం నిబంధనల ఉల్లంఘనే కాకుండా, భద్రతాపరమైన సమస్యలకు దారితీయవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు అక్రమ సరఫరా, అదనపు వసూళ్ల వ్యవహారం వల్ల ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగిస్తోంది.
తనిఖీలు మరిచారు...
ఏ హోటల్‌కు వెళ్లినా, రోడ్‌సైడ్ టిఫిన్ సెంటర్‌కు వెళ్లినా అధికంగా డొమెస్టిక్ సిలిండర్లే కనిపిస్తాయి. బహిరంగంగా డొమెస్టిక్ సిలిండర్లను వినియోగిస్తున్నా ఏ ఒక్క పౌరసరఫరాల శాఖ అధికారి పట్టించుకోవడంలే దన్న ఆరోపణలు వస్తున్నాయి. తక్కువ ధరకు వచ్చే డొమెస్టిక్ సిలిండర్లను వినియోగిస్తున్న హోటల్ వ్యాపారులు వినియోగదారుల నుంచి మాత్రం గ్యాస్ ధరలు పెరిగాయంటూ అధిక ధరలు వసూలు చేస్తున్నారని వినియో గదారుల మండలి ప్రతినిధులు తెలిపారు.
గ్యాస్ ధరలు పెరిగినప్పటి నుంచి అక్రమ గ్యాస్ దందా నడుస్తున్నా యంత్రాంగం తనిఖీలు చేయకపోవ డంపై విమర్శలు వస్తున్నాయి. వరంగల్ జిల్లాలో మొత్తం 2వేలకు పైగా హోటళ్లు, టిఫిన్ సెంటర్లు ఉండగా, కమర్షియల్ గ్యాస్ కనెక్షన్లు 1452 ఉన్నాయి. అలాగే జిల్లాలో మొత్తం 15 ఎల్పీజీ గ్యాస్ ఏజన్సీలుండగా, అందులో డొమెస్టిక్ ఎల్పీజీ కనెక్షన్లు (14.2కేజీలు)3,15,056, కమర్షియల్ కనెక్షన్లు(19కేజీలు) 1,452, దీపం కనెక్షన్లు 61,913, పీఎంయెవై కనెక్షన్లు 4,179 ఉన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
‘గులాబీ’లో గలాట.. ఓరుగల్లు బీఆర్ఎస్ నేతల్లో ఆధిపత్య పోరు
అండాల దందాలో డాక్టర్ పద్మజాది కీలక పాత్ర..
Read Latest AP News And Telangana News And International News And Telugu News