Share News

హనుమకొండలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి, ముగ్గురి పరిస్థితి విషమం

ABN , Publish Date - Jun 28 , 2026 | 09:14 AM

హనుమకొండలోని కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన కారు ముందుగా డివైడర్‌ను ఢీకొట్టి, అనంతరం రోడ్డు పక్కన ఉన్న ఓ ఇంటిలోకి దూసుకెళ్లింది.

హనుమకొండలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి, ముగ్గురి పరిస్థితి విషమం
Hanamkonda Road Accident

హనుమకొండ, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): హనుమకొండలోని కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలో ఈరోజు(ఆదివారం) ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన కారు ముందుగా డివైడర్‌ను ఢీకొట్టి, అనంతరం రోడ్డు పక్కన ఉన్న ఓ ఇంటిలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో కారులో నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తుండగా, వారిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడిని కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్‌కు చెందిన కళ్లెం శ్రీనివాస్‌గా గుర్తించారు. సమాచారం అందగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్ గ్రామంలో తన స్నేహితుడిని ఇంటి వద్ద దింపిన అనంతరం శ్రీనివాస్ తన స్వగ్రామమైన లక్ష్మీపూర్‌కు తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గాయపడిన ముగ్గురిని వెంటనే చికిత్స నిమిత్తం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.


ఈ వార్తలు కూడా చదవండి...

తెలంగాణ రైజింగ్ విజన్‌కు ప్రపంచ దిగ్గజ కంపెనీల మద్దతు: సీఎం రేవంత్ రెడ్డి

సీషెల్స్ పర్యటనలో గ్లోబల్ సౌత్ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్తాం: ప్రధాని మోదీ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jun 28 , 2026 | 09:15 AM