బీఆర్ఎస్‌తో జీవన్ రెడ్డి చేతులు కలపడం బాధాకరం: మహేశ్ కుమార్ గౌడ్
ABN , Publish Date - Apr 11 , 2026 | 03:16 PM
కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లో చేరి మాజీ మంత్రి జీవన్ రెడ్డి తప్పుచేశారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లూ తమకంటే ఎక్కువగా బీఆర్ఎస్ అవినీతిపై మాట్లాడిన ఆయన ఆ పార్టీతో చేతులు కలపడం బాధాకరమని పేర్కొన్నారు.
ములుగు, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లో చేరి మాజీ మంత్రి జీవన్ రెడ్డి తప్పుచేశారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లూ తమకంటే ఎక్కువగా బీఆర్ఎస్ అవినీతిపై మాట్లాడిన ఆయన ఆ పార్టీతో చేతులు కలపడం బాధాకరమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ముక్కలైందని.. ఆస్తుల కోసం కొట్టుకుంటున్నారని విమర్శించారు. బీజేపీకి తెలంగాణలో ఆదరణ లేదని అన్నారు. ఈరోజు(శనివారం) ములుగు జిల్లాలో మహేశ్ కుమార్ గౌడ్ పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
కాంగ్రెస్ 100 స్థానాల్లో గెలుస్తుంది..
ఉన్నఫలంగా ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 100స్థానాల్లో గెలుస్తుందని మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. దశా, దిశా లేకుండా పదేళ్లు కేసీఆర్ పరిపాలన చేశారని, రూ.8 లక్షల కోట్లు అప్పు చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తమ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని తెలిపారు. కాంట్రాక్టర్లు ఇచ్చే డబ్బులతో జేబులు నింపుకోవడంతోనే కాళేశ్వరం కూలిపోయిందని మహేశ్ కుమార్ గౌడ్ విమర్శలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
రౌడీషీటర్లపై సీపీ సజ్జనార్ కీలక చర్యలు
సీడబ్ల్యూసీలో పార్లమెంటు వ్యూహాలపై అగ్ర నేతల చర్చ
హైదరాబాద్‌లో ప్రేమ పేరుతో వల.. హిందూ అమ్మాయిలే టార్గెట్..
Read Latest Telangana News And AP News And International News And Telugu News