Share News

వరంగల్ నగరాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం: మంత్రి శ్రీధర్ బాబు

ABN , Publish Date - Oct 17 , 2026 | 09:09 AM

వరంగల్ నగరాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత వరంగల్ అభివృద్ధి చెందుతోందని తెలిపారు.

వరంగల్ నగరాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం: మంత్రి  శ్రీధర్ బాబు
Telangana Minister Sridhar Babu

వరంగల్ జిల్లా, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): వరంగల్ నగరాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు (Telangana Minister Sridhar Babu) వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత వరంగల్ అభివృద్ధి చెందుతోందని తెలిపారు. త్వరలోనే వరంగల్ ఎయిర్ పోర్టును ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈరోజు (శనివారం) హనుమకొండలో ట్రై సిటీస్ హాఫ్ మారథాన్ – ఎడిషన్ 10K రన్‌లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు నాయిని, నాగరాజు, GWMC కమిషనర్ పాల్గొన్నారు.


యువతలో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించి, ఫిట్‌నెస్‌, క్రీడాస్ఫూర్తిని ప్రోత్సహించే లక్ష్యంతో నాయిని విశాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రై సిటీస్ హాఫ్ మారథాన్ 10Kను నిర్వహించారు. NIT నుంచి హయగ్రీవచారి మైదానం వరకు ఈ మారథాన్ కొనసాగింది. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడారు. హనుమకొండలో IT టవర్ ఏర్పాటు చేస్తామని అన్నారు. యువత మత్తుకు దూరంగా ఉండాలని సూచించారు. యువత ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. నాయిని విశాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 5k,10k, 21k రన్ నిర్వహించడం సంతోషంగా ఉందని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నన్ను కిరాయి మనుషులతో కేటీఆర్ తిట్టిస్తున్నారు.. కవిత ధ్వజం

మొక్కజొన్న పంట మధ్యలో గంజాయి సాగు.. పోలీసుల ఉక్కుపాదం

మహిళలు స్వయంకృషితో ఎదిగేందుకు ఎన్టీఆర్‌ ట్రస్ట్ చేయూత: నారా భువనేశ్వరి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 17 , 2026 | 10:01 AM