వినాయక మాల వేసుకున్నారని..
ABN , Publish Date - Sep 16 , 2026 | 11:40 AM
గణేష్ నవరాత్రుల సందర్భంగా పలువురు విద్యార్థులు (గణేష్ దీక్ష) వినాయక మాల ధరించారు. మంగళవారం గణేష్ మాల (కండువా) ధరించి పాఠశాలకు వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన అక్క, తమ్ముడిని టీచర్లు అడ్డుకున్నారు.
విద్యార్థులను పాఠశాలలోకి రాకుండా అడ్డుకున్న టీచర్లు
తల్లిదండ్రులు, ఏబీవీపీ, వీహెచ్‌పీ కార్యకర్తల ఆందోళన
హనుమకొండలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో ఘటన
వరంగల్: గణేష్ నవరాత్రుల సందర్భంగా పలువురు విద్యార్థులు (గణేష్ దీక్ష) వినాయక మాల ధరించారు. మంగళవారం గణేష్ మాల (కండువా) ధరించి పాఠశాలకు వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన అక్క, తమ్ముడిని టీచర్లు అడ్డుకున్నారు. మాల విరమణ చేస్తేనే స్కూల్‌కు రావాలని స్పష్టం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఏబీవీపీ, బజరంగ్‌దళ్, వీహెచ్‌పీ నాయకులు, విద్యార్థులు తల్లిదండ్రులు ఆ ప్రైవేట్ స్కూల్‌కు చేరుకొని విద్యార్థులను ఎందుకు అడ్డుకున్నారని నిలదీశారు.
దీంతో పాఠశాల ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా విద్యార్థులు తండ్రి కె. శ్రీకాంత్ మాట్లాడుతూ.. హనుమకొండ 4వ డివిజన్ మాదిరెడ్డికుంటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో తన కూతురు, కుమారుడు కొన్నేళ్లుగా చదువుతున్నారని చెప్పారు. ఈ నెల 14న వినాయక చవితి నేపథ్యంలో ఏటా మాదిరిగానే ఈ ఏడాది సైతం వినాయక మాలను ధరించి మంగళవారం వారు చదువుకునే పాఠశాలకు వెళ్లారన్నారు. అక్కడ ఉన్న టీచర్లు తమ పిల్లల్ని అడ్డుకున్నారని, మాలల ధరించి స్కూల్ రావొద్దని మందలించారని చెప్పారు.
దీంతో పిల్లలు తనకు ఫోన్ చేసి చేసి స్కూల్‌లో జరిగిన ఘటన గురించి వివరించగా వెంటనే పాఠశాలకు వెళ్లానన్నారు. అక్కడ టీచర్లను అడగగా.. పాఠశాలకు విద్యార్థులు ఆధ్యాత్మిక మాలలు వేసి రాకూడదని, లేదంటే మాల విరమణ చేసి రావాలని చెప్పారన్నారు. ఎంత చెప్పినా పాఠశాల సిబ్బంది వినిపించుకోకపోవడంతో నగరంలోని ఏబీవీపీ, బజరంగ్‌దళ్, వీహెచ్‌పీ నాయకులకు సమాచారం ఇచ్చానన్నారు.
వారు పాఠశాలకు చేరుకుని యాజమాన్యాన్ని నిలదీశారన్నారు. దీంతో విద్యార్థులను మాలలు వేసుకోవద్దని చెప్పలేదని, కొన్ని ఆనివార్య కారణాల వల్ల మాలల ధరించడం ఇబ్బందిగా ఉంటుందని చెప్పామని తెలిపారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ బాధ్యులు సందీప్‌రెడ్డి, సునంద్, హిందూవాహిని బాధ్యులు రాంశర్మ, అశోక్, రాజు, ఓబీసీ మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్క సునీల్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
పదేళ్లుగా అవే.. మారని వీవో కమిటీలు
హైదరాబాద్‌లో లిఫ్ట్ గుంతలో పడి పెయింటర్ మృతి
Read Latest AP News And Telangana News And International News And Telugu News