Share News

హనుమాన్ మాలలో విద్యార్థి.. అనుమతించని స్కూల్ యాజమాన్యం..

ABN , Publish Date - Apr 15 , 2026 | 02:05 PM

హనుమాన్ మాలలో వచ్చిన విద్యార్థిని పాఠశాలలోకి అనుమతించకపోవడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఓ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

హనుమాన్ మాలలో విద్యార్థి.. అనుమతించని స్కూల్ యాజమాన్యం..
Bhupalpally School Controversy

జయశంకర్ భూపాలపల్లి , ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): హనుమాన్ మాలలో వచ్చిన విద్యార్థిని పాఠశాలలోకి అనుమతించకపోవడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఓ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది.

అసలేం జరిగిందంటే..?

7వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి హనుమాన్ దీక్ష తీసుకున్నాడు. దీంతో హనుమాన్ మాల ధరించి పాఠశాలకు వెళ్లాడు. అయితే పాఠశాల హెడ్ మాస్టర్ ఆ విద్యార్థిని గేటు వద్దే అడ్డుకున్నారు. మాల ధరించి తరగతి గదిలోకి రాకూడదని చెప్పారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు.


బజరంగదళ్ ఆందోళన..

హెడ్ మాస్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థి తల్లిదండ్రులు, బజరంగదళ్ కార్యకర్తలు.. పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు. పాఠశాల ప్రాంగణంలో నినాదాలు చేస్తూ భైఠాయించారు. హిందూ ఆచారాలను అవమానించిన హెడ్ మాస్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

డీలిమిటేషన్‌‌పై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలి: సీఎం రేవంత్ రెడ్డి

రేవంత్ వ్యాఖ్యలు అంబేడ్కర్ ఆశయాలకు వ్యతిరేకం: కిషన్ రెడ్డి

ఎండల్లో బయటకు రావొద్దు.. ప్రజలకు మంత్రి సీతక్క సూచనలు

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Apr 15 , 2026 | 02:31 PM