సింగరేణి డిస్మిస్డ్ ఉద్యోగులకు మరో అవకాశం
ABN , Publish Date - Nov 04 , 2026 | 10:48 AM
భూపాలపల్లి సింగరేణి ఏరియాలో డిస్మిస్డ్ ఉద్యోగులకు సంస్థ మరో అవకాశం కల్పించిందని ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
పునఃనియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
కాకతీయఖని(భూపాలపల్లి): భూపాలపల్లి సింగరేణి ఏరియాలో డిస్మిస్డ్ ఉద్యోగులకు సంస్థ మరో అవకాశం కల్పించిందని ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గైర్హాజరు కారణంగా 2023 నుంచి 2025 మధ్య విధుల నుంచి తొలగింపునకు గురైన వారిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకునేందుకు సంస్థ సిద్ధమైనట్టు పేర్కొన్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించిందని తెలిపారు.
ఇందుకు హైపవర్ కమిటీ ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. 2026 ఏప్రిల్ నాటికి 46ఏళ్ల వయసు కలిగి ఉండటంతో పాటు గత ఐదేళ్లలో ఏవైనా రెండేళ్లలో కనీసం 100 మస్టర్లు పూర్తి చేసిన వారు ఈ పునఃని యామకానికి అర్హులని పేర్కొన్నారు. అభ్యర్థులు వైద్యపరంగా ఫిట్‌గా ఉండా లలని, ఈనెల 14లోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మళ్లీ స్వల్పంగా పెరిగిన బంగారం ధర
బీఆర్‌ఎస్ గుర్తింపు రద్దు చేయాలి
Read Latest AP News And Telangana News And International News And Telugu News