Share News

ఐపీఎల్ 2027: తెరపైకి మరో ట్రేడ్ డీల్.. రూ.13 కోట్ల స్టార్ క్రికెటర్‌పై సీఎస్కే కన్ను!

ABN , Publish Date - Nov 04 , 2026 | 10:04 AM

ఐపీఎల్ 2027కి ముందు మరో ట్రేడ్ డీల్ తెరపైకి వచ్చింది. ఇంగ్లండ్ విధ్వంసకర ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్‌ను తమ జట్టులోకి తీసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.

ఐపీఎల్ 2027: తెరపైకి మరో ట్రేడ్ డీల్.. రూ.13 కోట్ల స్టార్ క్రికెటర్‌పై సీఎస్కే కన్ను!
SRH, CSK

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందే ఫ్రాంచైజీల మధ్య ట్రేడింగ్ వ్యవహారం ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్ స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ట్రేడ్‌పై భారీ చర్చ జరుగుతుండగా.. తాజాగా మరో కీలక ఆటగాడి పేరు తెరపైకి వచ్చింది. ఇంగ్లండ్ విధ్వంసకర ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్‌ను తమ జట్టులోకి తీసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) నుంచి అతడిని ట్రేడ్ చేసుకునే అవకాశాలను సీఎస్కే పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.


ఐపీఎల్ 2026 వేలానికి ముందు లియామ్ లివింగ్‌స్టోన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏకంగా రూ.13 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఆ సీజన్‌లో అతడి ప్రదర్శన ఏమాత్రం ఆశించిన స్థాయిలో లేదు. కేవలం రెండు మ్యాచ్‌లు ఆడిన లివింగ్‌స్టోన్ 15 పరుగులు మాత్రమే చేశాడు. పేలవ ఫామ్ కారణంగా మిగిలిన సీజన్‌లో తుది జట్టులోనే కాకుండా ఇంపాక్ట్ ప్లేయర్‌గా కూడా అవకాశం దక్కించుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో అతడిని వదులుకునేందుకు ఎస్ఆర్‌హెచ్ సిద్ధమైనట్లు సమాచారం. దీంతో తమ జట్టులో ఓ విదేశీ ఆటగాడి కోసం సీఎస్కే పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి:

న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. టాస్ నెగ్గిన భారత్

వైభవ్‌ను నెమ్మదిగా ఎదగనివ్వండి.. తొందరపాటు నిర్ణయాలు వద్దు: సచిన్ టెండూల్కర్

Updated Date - Nov 04 , 2026 | 10:04 AM