వైభవ్‌ను నెమ్మదిగా ఎదగనివ్వండి.. తొందరపాటు నిర్ణయాలు వద్దు: సచిన్ టెండూల్కర్
ABN , Publish Date - Nov 04 , 2026 | 07:08 AM
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైభవ్‌కు ఇప్పుడే అదనపు బాధ్యతలు అప్పగించడం సరికాదని మేనేజ్‌మెంట్‌కు సూచించాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 15 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసిన వైభవ్.. అవకాశం దక్కినప్పుడల్లా అద్భుతంగా రాణిస్తున్నాడు. కాగా దులీప్ ట్రోఫీలో వైస్ కెప్టెన్‌గా, కొన్ని మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహిరించిన సంగతి తెలిసిందే. ఇదే విషయంపై సచిన్‌కు ఓ అభిమాని నుంచి ప్రశ్న ఎదురైంది.
ఓ అభిమాని.. 15 ఏళ్ల వైభవ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంపై మీ అభిప్రాయం ఏంటని సచిన్‌ను ప్రశ్నించాడు. దీనికి సచిన్ స్పందిస్తూ.. ‘దులీప్ ట్రోఫీలోనే అతడిని వైస్ కెప్టెన్‌గా నియమించడం కాస్త తొందరపాటే. ముందుగా రెడ్ బాల్ క్రికెట్‌లో మరిన్ని మ్యాచ్‌లు ఆడనివ్వాలి. ఒక్కో దశను దాటుకుంటూ ముందుకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలి. నెమ్మదిగా ఎదిగితేనే వైభవ్ అన్నీ నేర్చుకోగలడు’ అని సచిన్ వెల్లడించాడు.
రూట్‌పై సచిన్ ప్రశంసల వర్షం
భారత్ కాకుండా విదేశీ ప్లేయర్లలో తనకు ఇష్టమేన క్రికెటర్ ఎవరనే ప్రశ్న సచిన్‌కు ఎదురైంది. దీంతో అతడు హ్యారీ బ్రూక్, జో రూట్, స్టీవ్ స్మిత్ పేర్లను ప్రస్తావించాడు. ముఖ్యంగా జో రూట్ తన టెస్టు పరుగుల రికార్డుకు చేరువవుతున్న నేపథ్యంలో అతడిపై సచిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘రూట్‌ను నేను ఎప్పుడూ అత్యుత్తమ ఆటగాడిగా భావిస్తాను. అతడి తొలి టెస్టు మ్యాచ్‌లోనే భవిష్యత్తులో గొప్ప ఆటగాడిగా ఎదుగుతాడని నాకు అర్థమైంది’ అని ప్రశంసించాడు.
ఇవి కూడా చదవండి:
14 బంతుల్లో 50 ప్రేమా రావత్ రికార్డు