Share News

14 బంతుల్లో 50 ప్రేమా రావత్‌ రికార్డు

ABN , Publish Date - Nov 04 , 2026 | 01:54 AM

భారత మహిళా క్రికెటర్‌ ప్రేమా రావత్‌ 14 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ బాది సరికొత్త రికార్డు నెలకొల్పింది. మహిళల టీ20 క్రికెట్‌లో ఇదే అత్యంత వేగవంతమైనది కావడం విశేషం.

14 బంతుల్లో 50 ప్రేమా రావత్‌ రికార్డు
Prema Rawat

పుణే: భారత మహిళా క్రికెటర్‌ ప్రేమా రావత్‌ 14 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ బాది సరికొత్త రికార్డు నెలకొల్పింది. మహిళల టీ20 క్రికెట్‌లో ఇదే అత్యంత వేగవంతమైనది కావడం విశేషం. దీంతో ఫాతిమా సనా (పాకిస్థాన్‌), మేరీ కెల్లీ (ఇంగ్లండ్‌), లారా హ్యారిస్‌ (ఆసీస్‌) పేరిట ఉన్న 15 బంతుల రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. సీనియర్‌ మహిళల టీ20 ట్రోఫీలో భాగంగా సోమవారం హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉత్తరాఖండ్‌ తరఫున ప్రేమ 18వ ఓవర్‌లో బరిలోకి దిగింది. తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో అజేయంగా 50 పరుగులు చేసిన రావత్‌.. ఆ తర్వాత రెండు వికెట్లు కూడా తీసి జట్టు విజయానికి దోహదపడింది.


ఇవి కూడా చదవండి:

‘పేస్‌’ దళం కాపాడేనా?

షట్లర్లకు ‘సాయ్‌’ షాక్‌

రైజింగ్‌ స్టార్స్‌ ఆసియా కప్‌లో భారత్‌-ఎ సారథి తిలక్‌ వర్మ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 04 , 2026 | 01:54 AM