రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో భారత్-ఎ సారథి తిలక్ వర్మ
ABN , Publish Date - Nov 04 , 2026 | 01:49 AM
ఏసీసీ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో పాల్గొనే భారత్-ఎ జట్టుకు హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ సారథ్యం వహించనున్నాడు.
న్యూఢిల్లీ: ఏసీసీ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో పాల్గొనే భారత్-ఎ జట్టుకు హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ సారథ్యం వహించనున్నాడు. ఈ నెల 19 నుంచి 29 వరకు దోహాలో వన్డే ఫార్మాట్‌లో జరిగే టోర్నీ కోసం నెం:1 టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మను ఎంపిక చేశారు. 2025లో టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఈ టోర్నీలో ఆడిన టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ, సూర్యాంశ్ షెడ్గే, హర్ష్ దూబేలకు మరోసారి భారత జట్టు తరఫున ఆడే అవకాశం లభించించింది.
గ్రూప్-బిలో భారత్‌తోపాటు పాకిస్థాన్, నేపాల్, యూఏఈ జట్లు.. గ్రూప్-ఎలో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్, హాంకాంగ్ ఆడనున్నాయి. గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. ఈ నెల 20న నేపాల్‌తో తొలి మ్యాచ్ ఆడనున్న భారత్.. 22న పాకిస్థాన్‌తో, 24న యూఏఈతో తలపడనుంది.
ఇవి కూడా చదవండి:
ఇజ్రాయెల్‌కు ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తాము: ట్రంప్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News