Share News

ఇజ్రాయెల్‌కు ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తాము: ట్రంప్

ABN , Publish Date - Nov 03 , 2026 | 08:50 PM

సైనిక అవసరాల కోసం ఇజ్రాయెల్‌కు చేస్తున్న 4 బిలియన్ డాలర్ల వార్షిక ఆర్థిక సాయాన్ని వచ్చే ఏడాది నుంచి నిలిపివేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తెలిపారు. ఈ విషయమై ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో అంగీకారం కుదిరిందన్నారు.

ఇజ్రాయెల్‌కు ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తాము: ట్రంప్
Donald Trump

ఇంటర్నెట్ డెస్క్: సైనిక అవసరాల కోసం ఇజ్రాయెల్‌కు చేస్తున్న 4 బిలియన్ డాలర్ల వార్షిక ఆర్థిక సాయాన్ని వచ్చే ఏడాది నుంచి నిలిపివేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తెలిపారు. ఈ విషయమై ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో అంగీకారం కుదిరిందన్నారు. ఇజ్రాయెల్‌కు ఈసాయం ఇక అవసరం లేదని కూడా చెప్పారు. ఇజ్రాయెల్‌కు అమెరికా ఇస్తున్న నిధుల పేరు చెప్పి ప్రతిపక్ష డేమోక్రాట్లు తమను విమర్శి్స్తున్నారని అన్నారు. ఈ ఏడాది చివరికల్లా సాయం నిలిపివేతకు ఇజ్రాయెల్‌ కూడా అంగీకరించిందని చెప్పారు. రాబోయే పదేళ్లలో అమెరికా ఆర్థిక సాయాన్ని తగ్గించే యోచనలో ఉన్నామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు జనవరిలో పేర్కొన్నారు.


2023లో హమాస్ దాడులు, ఆ తరువాత గాజాపై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అమెరికా ఇప్పటివరకూ 21.7 బిలియన్ డాలర్ల ఆర్థికసాయాన్ని ఇరాన్‌కు అందించింది. ఇక ట్రంప్ కామెంట్స్‌ ప్రధాని నెతన్యాహు ప్రతినిధి మాట్లాడుతూ ఆ కామెంట్స్‌కు సంబంధించి పూర్తి వివరాలు తన వద్ద లేవని అన్నారు. 4 బిలియన్ డాలర్ల వార్షిక సాయంపై కుదిరిన డీల్ 2028లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇరాన్‌తో యుద్ధం త్వరలో ముగుస్తుందనేందుకు ఇది సంకేతమని అనేక మంది భావిస్తున్నారు. దీంతో, నేడు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 3 శాతం మేర తగ్గి 101 డాలర్లు చేరుకుంది. గత మూడు వారాల్లో ఇదే అత్యంత కనిష్ఠ ధర అని పరిశీలకులు చెబుతున్నారు.

Updated Date - Nov 03 , 2026 | 08:50 PM